ఏపీ ప్రయాణికులకు శుభవార్త - ఇక అరుణాచలం, బెంగళూరుకు రెగ్యూలర్ ట్రైన్స్..! ఇవిగో వివరాలు
నరసాపురం నుంచి బెంగళూరు, తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను 2026 జూలై నుంచి శాశ్వత సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) శుభవార్తను అందించింది. నరసాపురం నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లను (Train on Demand - TOD) శాశ్వత రైళ్లుగా (రెగ్యులరైజ్) మారుస్తూ రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2026 జూలై మొదటి వారం నుంచి అమలులోకి రానుంది. ప్రయాణికుల రద్దీ, నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఈ అడుగు వేసింది.

నరసాపురం – తిరువణ్ణామలై – నరసాపురం :
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తుల కోసం ఈ రైలును రెగ్యులరైజ్ చేశారు. 2026 జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయి.
- నరసాపురం – తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్(ట్రెయిన్ నంబర్ 17291 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 13:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు (గురువారం) తెల్లవారుజామున 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై – నరసాపురం ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 17292 ) ప్రతి గురువారం ఉదయం 11:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 02:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాంట్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
నరసాపురం – బెంగళూరు – నరసాపురం :
- ఐటీ నగరం బెంగళూరు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారుల కోసం ఈ రైలు సర్వీసును శాశ్వతం చేశారు. 2026 జూలై 3వ తేదీ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది.
- నరసాపురం – SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్(ట్రెయిన్ నంబర్ 17293 ) ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 15:50 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు (శనివారం) ఉదయం 09:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో ట్రెయిన్ నంబర్ 17294 SMVT బెంగళూరు – నరసాపురం ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) తెల్లవారుజామున 06:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఈ సర్వీసు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్టై, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లు శాశ్వతం కావడం వల్ల భక్తులకు, ఐటీ ఉద్యోగులకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడం మరింత సులభతరం కానుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

