నరసాపురం యార్డ్‌లో పనుల వల్ల పలు రైళ్లు దారిమళ్లింపు, కొన్ని రద్దు!

నరసాపురం యార్డ్‌లో అభివృద్ధి పనుల కారణంగా జూన్ 18, 19వ తేదీలలో పలు రైలు సర్వీసులపై ప్రభావం పడనుంది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే వివరాలను వెల్లడించింది.

Published on: Jun 17, 2026, 15:57:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్, నరసాపురం యార్డ్‌లో కీలకమైన సిగ్నలింగ్, మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులను చేపట్టనుంది. ఈ అభివృద్ధి పనుల కారణంగా జూన్ 18, 19వ తేదీల్లో పలు రైలు సర్వీసులలో మార్పులు ఉంటాయని రైల్వే శాఖ అధికారిక ప్రటన విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జూన్ 18న ఉదయం 11:30 గంటల నుండి 24 గంటల డిస్‌కనెక్ట్, జూన్ 19న రెండు గంటల ట్రాఫిక్ బ్లాక్ విధించనున్నారు. దీనివల్ల విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిడదవోలు, నరసాపురం మార్గాల్లో నడిచే పలు రైళ్లు పాక్షికంగా రద్దవ్వడమే కాకుండా, పాలకొల్లు, భీమవరం జంక్షన్ స్టేషన్ల నుంచే షార్ట్ టెర్మినేట్ (ముందే నిలిపివేయడం) లేదా ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

షార్ట్ టెర్మినేట్ కానున్న రైళ్ల వివరాలు

రైలు నెం. 67243, 67280 (నిడదవోలు - నరసాపురం) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు వద్దే నిలిపివేస్తారు.

రైలు నెం. 67258 (విజయవాడ - నరసాపురం) జూన్ 18న పాలకొల్లు వరకే నడుస్తుంది.

రైలు నెం. 17281 (గుంటూరు - నరసాపురం) జూన్ 18న భీమవరం వరకు మాత్రమే ప్రయాణిస్తుంది.

రైలు నెం. 17263 (భీమవరం జంక్షన్ - నరసాపురం) జూన్ 19న పాలకొల్లుతోనే ముగుస్తుంది.

రైలు నెం. 67245 (నిడదవోలు - నరసాపురం) జూన్ 19న పాలకొల్లు వద్దే ఆగిపోతుంది.

ఇతర స్టేషన్ల నుండి ప్రారంభమయ్యే రైళ్లు

రైలు నెం. 67247 (నరసాపురం - గుంటూరు) జూన్ 18, 19 తేదీల్లో నరసాపురానికి బదులు పాలకొల్లు నుండి బయలుదేరుతుంది.

రైలు నెం. 67276 (నరసాపురం - విజయవాడ) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు నుండే ప్రయాణం ప్రారంభమౌతుంది.

రైలు నెం. 67246 (నరసాపురం - రాజమండ్రి) జూన్ 18న పాలకొల్లు నుండి నడుస్తుంది.

రైలు నెం. 17282 (నరసాపురం - గుంటూరు) జూన్ 19న భీమవరం జంక్షన్ నుండి ప్రారంభమవుతుంది.

రైలు నెం. 67279 (నరసాపురం - నిడదవోలు), 17270 (నరసాపురం - విజయవాడ) జూన్ 19న పాలకొల్లు నుండే సర్వీసులు మొదలవుతాయి.

సురక్షితమైన, మెరుగైన రైలు కార్యకలాపాల కోసం జరుగుతున్న ఈ మార్పులను గమనించి, ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది.

దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్, నరసాపూరం యార్డ్‌లో కీలకమైన సిగ్నలింగ్, మౌలిక సదుపాయాల పనులను చేపట్టనుంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకొని, తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలని సూచించింది. సురక్షితమైన, మెరుగైన కార్యకలాపాల కోసం కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More