మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన లేస్ కళ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. లేస్ ఉత్పత్తుల గురించి యావత్ దేశం మాట్లాడుకుంటుందని చెప్పారు.
భారతదేశ సాంప్రదాయ చేతిపనులు, ముఖ్యంగా నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఆర్థిక వృద్ధిని, సామాజిక సాధికారతను ఎలా నడిపిస్తున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మన్‌కీ బాత్‌లో భాగంగా నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. లేస్ క్రాఫ్ట్‌ను "సహనం, సంక్లిష్టమైన కళాత్మకతకు చిహ్నం"గా ప్రశంసించారు.

తరతరాలుగా మహిళా చేతివృత్తులవారు అంకితభావంతో లేస్ ఉత్పత్తుల వారసత్వాన్ని నిలబెట్టుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ మద్దతుతో నైపుణ్య శిక్షణను అందిస్తోందన్నారు. నరసాపురం లేస్ ఉత్పత్తులు కొత్త డిజైన్లను పరిచయం చేస్తోందన్నారు. మార్కెట్ సంబంధాలను మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు.
నరసాపురం లేస్ పరిశ్రమ గణనీయమైన మైలురాళ్లను సాధించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వాటిలో భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందడం కూడా ఉందన్నారు. ఇది దాని బ్రాండ్ గుర్తింపు, మార్కెట్ విలువను పెంచిందన్నారు. ఈ రంగం ఇప్పుడు 250కి పైగా గ్రామాల్లో దాదాపు లక్ష మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 500కి పైగా రకాల లేస్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది.
ప్రధానమంత్రి ఈ లేస్ ఉత్పత్తుల పరిశ్రమను బలంతో కొమ్మలుగా పెరుగుతున్న చెట్టుతో పోల్చారు. ఆధునిక అవకాశాలతో సాంప్రదాయ నైపుణ్యాలకు మద్దతు ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా గ్రామీణ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించవచ్చని చెప్పారు.
ఈ లేస్ కళ తరతరలుగా మహిళల చేతుల్లో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని మహిళలు దీనిని ఓర్పుతో, శ్రద్ధతో పరిరక్షించారని కొనియాడారు. నేడు ఈ కళలు కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్లబడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా కళాకారులకు కొత్త డిజైన్లను నేర్పిస్తూ.. మెరుగైన నైపుణ్య శిక్షణ అందిస్తూ.. కొత్త మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నాయన్నారు.
నరసాపురం లేస్ ఉత్పత్తులకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. స్వీడన్ మిషనరీల సంస్థలు ఇక్కడ లేస్ అల్లికలను పరిచయం చేశారు. ఆ తర్వాత రానురాను దుస్తుల డిజైన్లను ఉపయోగించే లేస్ అల్లికలు.. త్వరగానే పెద్ద పరిశ్రమగా మారింది. వివిధ దేశాలలో నరసాపురం లేస్‌ను ఉపయోగిస్తారు. 1930 ప్రాంతంలో లండన్ విధుల్లో నరసాపురం లేస్ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవన్నారు.
2000లో నరసాపురం లేస్ పార్కును ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద.. ఈ అరుదైన హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీనితో డీఆర్డీఏతో ఉపయోగించుకుని.. భారతదేశంలో మెుట్టమెుదటి లేస్ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసింది. లేస్ పార్క్ ఏర్పాటుతో అనేక మార్పులు వచ్చాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












