...
...
Next Story

Rayagada Guntur Express : రాయగడ - గుంటూరు ఎక్స్ ప్రెస్ అప్డేట్ - మారిన టైమింగ్స్, కొత్త టైమింగ్స్ ఇలా

రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ సమయాలను దక్షిణ కోస్తా రైల్వే సవరించింది. ఆగస్టు 24 నుంచి రాయగడ, జిమిడిపేట స్టేషన్లలో రైలు 10 నిమిషాలు ముందుగానే బయలుదేరనుంది.

Published on: Aug 22, 2026, 07:18:57 IST
Advertisement

రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రాయగడ-గుంటూరు రైలు సమయాల్లో మార్పు
రాయగడ-గుంటూరు రైలు సమయాల్లో మార్పు

రైలు బయలుదేరే సమయాన్ని 10 నిమిషాలు ముందుకు జరిపినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రయాణికులు రైలు మిస్ కాకుండా ఉండేందుకు కొత్త టైమింగ్స్‌ను గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

కొత్త టైమింగ్స్ వివరాలు….

  • రాయగడ స్టేషన్ : ఇప్పటివరకు ఈ రైలు రాయగడ నుంచి మధ్యాహ్నం 15:00 గంటలకు (3:00 PM) బయలుదేరేది. ఆగస్టు 24 నుంచి మధ్యాహ్నం 14:50 గంటలకే (2:50 PM) బయలుదేరుతుంది.
  • జిమిడిపేట స్టేషన్ : ఈ స్టేషన్‌కు రైలు చేరుకునే, బయలుదేరే సమయాల్లో కూడా మార్పులు చేశారు. పాత వేళల ప్రకారం మధ్యాహ్నం 15:16 కి వచ్చి 15:18 కి బయలుదేరేది. కొత్త షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 15:06 గంటలకు జిమిడిపేట చేరుకుని, 15:08 గంటలకు బయలుదేరుతుంది.

గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయాణించే రూటులో దాదాపు 30 హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలుకు మాత్రమే ఈ టైమింగ్స్ లో మార్పు చేశారు. గుంటూరు-రాయగడ రైలులో ఎలాంటి మార్పు లేదు. ఈ మార్పును గమనించాలని ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే సూచించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe