...
...
Next Story

AISSEE 2027 : సైనిక్ స్కూల్స్‌ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తులు ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇదే

Sainik School Admission 2027 : సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాలకు ఎన్టీఏ ఏఐఎస్‌ఎస్‌ఎస్‌ఈ 2027 రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అభ్యర్థులు 2026 డిసెంబర్ 3 వరకు సాధారణ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Nov 4, 2026, 12:53:16 IST
Advertisement

Sainik School Admission 2027 : దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 6వ తరగతి, 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE - 2027) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు

సైనీక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
సైనీక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

  • ప్రవేశ పరీక్ష తేదీ: 2027 జనవరి 31న ఈ పరీక్షను నిర్వహిస్తారు.
  • దరఖాస్తు ముగింపు తేదీ: అభ్యర్థులు 2026 డిసెంబర్ 3 వరకు సాధారణ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆలస్య రుసుముతో గడువు : అదనపు రుసుముతో దరఖాస్తు రుసుము చెల్లించడానికి 2026 డిసెంబర్ 6 వరకు అవకాశం కల్పించారు.
  • దరఖాస్తుల సవరణ (కరెక్షన్ విండో) : దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి 2026 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
  • ఎగ్జామ్ సిటీ స్లిప్ : అభ్యర్థులకు పరీక్ష కేటాయించిన నగరాల వివరాలను (ఎగ్జామ్ సిటీ స్లిప్) 2027 జనవరి 11న వెల్లడిస్తారు.
  • అడ్మిట్ కార్డ్‌లు : దరఖాస్తుదారులు తమ హాల్ టికెట్లను 2027 జనవరి 25 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2027 జనవరి 31న నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను ఓఎంఆర్ (OMR) ఆధారిత పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహిస్తారు. 6వ తరగతి ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు (మొత్తం 2:30 గంటలు) జరుగుతుంది. ఇక 9వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (మొత్తం 3:00 గంటలు) కొనసాగుతుంది.

9వ తరగతి పరీక్ష విధానం : 9వ తరగతి ప్రవేశాల కోసం 150 ప్రశ్నలతో కూడిన పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 400. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి:

  • మ్యాథమెటిక్స్ (గణితం)
  • ఇంటెలిజెన్స్ (సామర్థ్య పరీక్ష)
  • ఇంగ్లీష్ (ఆంగ్లం)
  • జనరల్ సైన్స్ (సాధారణ శాస్త్రం)
  • సోషల్ సైన్స్ (సామాజిక శాస్త్రం)

సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల్లో చేరాలనుకునే విద్యార్థులు కింద పేర్కొన్న సులభమైన దశలను అనుసరించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు:

  • ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/sainik-school-society/ ని సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కనిపించే "AISSEE 2027 Registration" లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వ్యక్తిగత, రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.
  • వివరాలను సమర్పించిన (Submit) తర్వాత అప్లికేషన్ ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దరఖాస్తు పత్రంలో కోరిన సమాచారాన్ని నింపి, నిర్దేశిత పరీక్ష రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
  • చివరగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు ధృవీకరణ పత్రాన్ని (డౌన్‌లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఈ కన్ఫర్మేషన్ పేజీని ప్రింటౌట్ ను భద్రపరుచుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks