అమరావతి: ఆంధ్రప్రదేశ్ వేదికగా గ్రామీణ మహిళా సాధికారత దిశగా సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026'ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి దాటి వెలుపలి రాష్ట్రంలో ఈ స్థాయి జాతీయ ప్రదర్శనను నిర్వహించడం ఇదే మొదటిసారి.
జాతీయ స్థాయి భాగస్వామ్యం

దేశవ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 'దీన్దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్' (DAY-NRLM), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఈ ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులు, గృహోపకరణాలను ప్రదర్శించేందుకు వీలుగా ఏకంగా 650కి పైగా స్టాళ్లను ఇక్కడ సిద్ధం చేశారు.
యాప్, సంచిక విడుదల
ఈ వేడుకలో భాగంగా 'లఖ్పతి దీదీ సంచిక' (Compendium)తో పాటు 'సరస్ శక్తి' (SARAS Shakti) అప్లికేషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆవిష్కరించనున్నారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది మహిళలను 'లఖ్పతి దీదీ'లుగా తీర్చిదిద్దే సంకల్పాన్ని చాటిచెప్పే ప్రత్యేక చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.
"దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే 'వోకల్ ఫర్ లోకల్', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనకు గ్రామీణ మహిళా కళాకారులకు మద్దతుగా ప్రజలంతా ఈ మేళాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి" అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు.
నాలుగు ప్రత్యేక పెవిలియన్లు, లైవ్ శిక్షణ
ఈ ప్రదర్శన ప్రాంగణంలో లఖ్పతి దీదీ పెవిలియన్, నాలెడ్జ్ పెవిలియన్, కన్వర్జెన్స్ పెవిలియన్, లైవ్ డెమోన్స్ట్రేషన్ పెవిలియన్ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను తీర్చిదిద్దారు. కుండల తయారీ, ఎంబ్రాయిడరీ, చేనేత నేత వంటి సంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలను సందర్శకులు తిలకించవచ్చు. గ్రామీణ మహిళలకు ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై అవగాహన కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నాబార్డ్ (NABARD) సహా ప్రముఖ పారిశ్రామిక సంస్థల నిపుణులతో శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేశారు.
దేశీయ రుచులు.. ప్రముఖుల హాజరు
{{/usCountry}}ఈ ప్రదర్శన ప్రాంగణంలో లఖ్పతి దీదీ పెవిలియన్, నాలెడ్జ్ పెవిలియన్, కన్వర్జెన్స్ పెవిలియన్, లైవ్ డెమోన్స్ట్రేషన్ పెవిలియన్ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను తీర్చిదిద్దారు. కుండల తయారీ, ఎంబ్రాయిడరీ, చేనేత నేత వంటి సంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలను సందర్శకులు తిలకించవచ్చు. గ్రామీణ మహిళలకు ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై అవగాహన కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నాబార్డ్ (NABARD) సహా ప్రముఖ పారిశ్రామిక సంస్థల నిపుణులతో శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేశారు.
దేశీయ రుచులు.. ప్రముఖుల హాజరు
{{/usCountry}}నోరూరించే వంటకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 28 రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా మహిళా షెఫ్లు స్థానిక సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన సాంప్రదాయ వంటకాలను ప్రత్యక్షంగా తయారు చేస్తున్నారు. బీహారీ లిట్టీ చోఖా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, పంజాబీ మక్కే ది రోటీ-సర్సో కా సాగ్, వన్ సుందరి వంటి ప్రసిద్ధ పదార్థాలు ఇక్కడ లభిస్తాయి.
ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టాళ్లను పరిశీలించి మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల లఖ్పతి దీదీలతో కలసి ఆమె భోజనం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొంటున్నారు.