...
...
Next Story

AP Weather : ద్రోణి ప్రభావం - ఉత్తర కోస్తాకు వర్ష సూచన..! ఈ జిల్లాలకు వడగాలుల హెచ్చరిక

ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావతంతో ఏపీలోని ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Mar 8, 2026, 08:36:08 IST
Advertisement

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు… భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లలేకపోతున్నారు. మార్చి మాసంలోనే ఎండల తీవ్రత ఉండగా… రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండే సూచనలున్నాయి.

ఓవైపుఎండలు...! ఉత్తర కోస్తాకు వర్షసూచన (image istock)
ఓవైపుఎండలు...! ఉత్తర కోస్తాకు వర్షసూచన (image istock)

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మరో మూడు నాలుగు రోజులు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇవాళ దక్షిణ కోస్తాలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం కర్నూలులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఉత్తర కోస్తాకు వర్ష సూచన…!

మరోవైపు ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు వ్యాపించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల మాత్రమే వడగాలులు, ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది.

ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుంది. దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.

ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించవచ్చు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నందున్న… అలాంటి సమయంలో చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe