...
...
Next Story

తిరుపతి వెళ్లే రైల్వే ప్రయాణికులకు శుభవార్త - ఈ ట్రైన్ ఇక అక్కడ కూడా ఆగుతుంది..!

తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి అకోలా తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు.. మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది.

Updated on: Mar 7, 2026, 15:29:07 IST
Advertisement

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - అకోలా - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది. ఈ రైల్వే స్టేషన్ అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం మార్చి 6 తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.

రైలు ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణికులకు శుభవార్త

దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్న వివరాల ప్రకారం….. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైల్ ( ట్రైన్ నెంబర్ 07605) తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది.

తాజా నిర్ణయం ప్రకారం.... ఈ ట్రైన్ తెల్లవారుజామున 2 గంటల 49 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగుతుంది. అనంతరం 2.50 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

ఇక అకోలా -తిరుపతి మధ్య నడిచే(ట్రైన్ నెంబ్ 07606) ట్రైన్ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2.34 నిమిషాలకు మొలకలచెరువు రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగి... మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

ఈ ట్రైన్ ఏపీలోని ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ తో పాటు తెలంగాణలోని గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి తర్వాత కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks