Charlapalli-Srikakulam Special Trains : చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

Charlapalli-Srikakulam Special Trains : దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య ఈ సర్వీసులు జనవరి 2027 వరకు నడవనున్నాయి.

Published on: Nov 28, 2026, 15:54:13 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య చాలామంది ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య నడవనున్నాయి. జనవరి 18వ తేదీ వరకు ఈ సర్వీసులను నడపనున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.

సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్
సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్

రైలు నెంబర్ 07119 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ట్రైన్ 2027 జనవరి 10, 17వ తేదీల్లో రెండు సర్వీసులు నడుస్తాయి. ఈ తేదీల్లో ఆదివారంనాడు సాయంత్రం 4:20కి చర్లపల్లి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 07120 శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి జనవరి 11, 18వ తేదీల్లో 2 సర్వీసులు నడుస్తాయి. శ్రీకాకుళంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందూర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లిలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

శబరిమల స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్, కొల్లాం మధ్య ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జనవరి 2027లో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

07193 నంబరు రైలు హైదరాబాద్ నుంచి కొల్లాం వైపు శనివారాల్లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 7.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. 2027 జనవరి 2 నుంచి జనవరి 23 వరకు మొత్తం 4 సర్వీసులు నడుస్తాయి.

07194 నంబరు రైలు కొల్లాం నుంచి హైదరాబాద్ వైపు సోమవారాల్లో ఉదయం 10.55 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. 2027 జనవరి 4 నుంచి జనవరి 25 వరకు మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఈ ట్రైన్ తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల వద్ద ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో 07194 కొల్లాం - హైదరాబాద్ రైలు తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చర్లపల్లి, సికింద్రాబాద్ వస్తుంది.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.