సంక్రాంతి రద్దీ : విజయవాడ - హైదరాబాద్ మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు - తేదీలు, రూట్ల వారీగా వివరాలు

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అంతేకాకుండా మరికొన్ని రూట్లలోనూ స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు పేర్కొంది.

Published on: Jan 10, 2026, 14:18:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఓవైపు బస్టాండ్లలో… మరోవైపు రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపిస్తోంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం…. కొన్ని హైదరాబాద్ - విజయవాడ మధ్య నడవనున్నాయి. మరికొన్ని హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య సేవలు అందించనున్నాయి. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

  • హైదరాబాద్ - విజయవాడ మధ్య జనవరి 11, 12, 12,18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి.
  • ఇక విజయవాడ - హైదరాబాద్ మధ్య జనవరి 10,11,12,17,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.40 నిమిషాలకు బయల్దేరి.. రాత్రి 10.35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటాయి.
  • హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్ పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.

హైదరాబాద్ - కాగజ్ నగర్ మధ్య జనవరి 11, 12 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.55 నిమిషాలకు బయల్దేరి... మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కాగజ్ నగర్ చేరుకుంటాయి.

కాగజ్ నగర్ - హైదరాబాద్ మధ్య జనవరి 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరి... రాత్రి 10.20 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్,చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, ఘన్ పూర్, కాజీపేట, ఉప్పల్, ఓదేల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో జననరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More