తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసెఫ్) అరెస్ట్ వ్యవహారంలో గన్నవరం పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించారు. సమాజంలో అశాంతిని రేకెత్తించడం, యువతను తప్పుడుదోవ పట్టించడమే లక్ష్యంగా నిందితుడు వ్యవహరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై ఆంధ్రప్రదేశ్‌లో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.

పోలీసుల నివేదిక ప్రకారం.. దేశంలో నిషేధించిన మావోయిస్టు తీవ్రవాద సంస్థల వైపు విద్యార్థులను, యువకులను ఆకర్షించేలా జోసెఫ్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటీవల ఏలూరు నగరంలో నిర్వహించిన దళిత క్రైస్తవ సభలో ఆయన చేసిన ప్రసంగం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ వ్యవస్థలను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రజల్లో ద్వేషాన్ని పెంచేందుకు ప్రయత్నించినట్లు రిపోర్ట్‌లో వివరించారు.
నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో మావోయిస్టు సిద్ధాంతాలకు సంబంధించిన కీలక సమాచారం లభ్యమైంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మాను గొప్పగా కీర్తిస్తూ ఆయన ప్రసంగాలు చేశాడని, సమాజంలో మతపరమైన చిచ్చు పెట్టడమే ధ్యేయంగా అవాకులు చవాకులు పేలుతున్నాడని పోలీసులు తెలిపారు. హిందూ దేవుళ్లను కించపరిచే ఉద్దేశంతోనే రావణ్ అనే పేరును పెట్టుకున్నాడని.. అయితే ప్రస్తుతం దర్యాప్తుకు నిందితుడు ఏమాత్రం సహకరించడం లేదని, అతని వెనుక ఉన్న సూత్రధారుల వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
గన్నవరానికి చెందిన జనసేన పార్టీ లీడర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు శనివారం అర్ధరాత్రి జోసెఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని ప్రేరేపించడం, దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152తో పాటు, కఠినమైన ఉపా (UAPA - చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద కేసులు నమోదు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
{{/usCountry}}గన్నవరానికి చెందిన జనసేన పార్టీ లీడర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు శనివారం అర్ధరాత్రి జోసెఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని ప్రేరేపించడం, దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152తో పాటు, కఠినమైన ఉపా (UAPA - చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద కేసులు నమోదు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
{{/usCountry}}మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది. రెండు వర్గాలుగా కొందరు నెటిజన్లు విడిపోయారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. రావణ్‌పై ఉపా ప్రయోగించడం దారుణం అని, ప్రశ్నించేవారి గొంతు నొక్కడమేనని కొందరు మాట్లాడుతున్నారు. మరికొందరేమో రావణ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పరిధి దాటితే ఇలాంటివే జరుగుతాయని చెబుతున్నారు.