...
...
Next Story

Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్ లో సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు, ఏపీలోని హాల్ట్ స్టేషన్లు ఇవే

Summer Special Trains : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి మధ్య నడిచే సమ్మర్ స్పెషల్ రైళ్ల సర్వీసులను పొడిగించారు. ఇరువైపులా మరో 3 ట్రిప్పుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు… ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: Jun 20, 2026, 11:49:39 IST
Advertisement

Summer Special Trains : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి జంక్షన్ మధ్య నడుస్తున్న వేసవి ప్రత్యేక రైళ్ల (సమ్మర్ స్పెషల్) సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా ఈ రైళ్లలో ఏసీ. స్లీపర్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.

పలు రైళ్లు పొడిగింపు
పలు రైళ్లు పొడిగింపు

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

  • రైలు సంఖ్య 06077 (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ → సంత్రాగచ్చి జంక్షన్) : ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం చెన్నై నుంచి బయలుదేరుతుంది. జూన్ 20వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. మొత్తం 3 ట్రిప్పుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.
  • రైలు సంఖ్య 06078 (సంత్రాగచ్చి జంక్షన్ → ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) : ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం సంత్రాగచ్చి నుంచి బయలుదేరుతుంది. జూన్ 22వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మొత్తం 3 ట్రిప్పుల పాటు నడుస్తుంది.

ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ ప్రత్యేక రైళ్లలో అధునాతన కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఒక ఏసీ 2-టైర్ (AC 2-Tier) బోగీ, మూడు ఏసీ 3-టైర్ (AC 3-Tier) బోగీలతో పాటు అత్యధికంగా పదిహేడు స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లను కేటాయించారు.

ఏపీలో ఆగే స్టేషన్లు…

వేసవి సెలవుల్లో సొంతూళ్లకు మరియు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ పొడిగించిన రైల్వే సేవలను ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks