Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు - వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తయింది.దాదాపు 16 నెలలపాటు విచారణ కొనసాగింది. తాజాగా తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను చేర్చింది.

Published on: Jan 24, 2026, 11:34:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి అయింది. తుది ఛార్జీషీట్ ను ఫైల్ చేసింది. మరిన్ని కీలక అంశాలను తుది ఛార్డీషీట్ లో ప్రస్తావించింది. ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని పేర్కొంది. ఛార్జిషీట్‌లో ముందుగా 24 మందిని నిందితులుగా పేర్కొనగా… మరో 12 మంది పాత్ర కూడా ఉన్నట్లు కోర్టుకు నివేదించింది. మొత్తంగా ఈ కేసులో 36 మంది నిందితులు ఉన్నట్లు పేర్కొంది.

తిరుమల లడ్డూ కేసు
తిరుమల లడ్డూ కేసు

16 నెలలకుపైగా విచారణ…

ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై 2024 సెప్టెంబర్ 24వ తేదీన సిట్‌ ఏర్పాటు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటై విచారణ కొనసాగింది. దాదాపు 16 నెలలపాటు… 10 రాష్ట్రాల్లో విచారణ జరిగింది.

ఈ కేసులో గతేడాది మేలో సిట్ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. తాజాగా తుది ఛార్జీషీటును ఫైల్ చేసింది. బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్, విపిన్‌ జైన్‌లను కీలక సూత్రధారులుగా గుర్తించింది. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎంతో పాటు, ఏ 27గా ఉన్న సుబ్రహ్మణ్యం, ఏ 24 చిన్నఅప్పన్న ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని సిట్ స్పష్టం చేసింది. హవాలా ద్వారా చిన్నఅప్పన్నకు రెండుసార్లు డబ్బులు కూడా అందాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా సిట్ ఛార్జీషీట్ లో ప్రస్తావించింది.

600కు పైగా పేజీలతో కూడిన ఛార్డీషీట్ లో పలువురు టీటీడీ ఉద్యోగుల పాత్రతో పాటు అధికారులు, డెయిరీ సంస్థల ప్రతినిధుల పేర్లను సిట్ పేర్కొంది. తమిళనాడులోని ఏఆర్‌ డెయిరీ నుంచి మొదలైన దర్యాప్తు పర్వం…. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాలకు చెందిన నిందితులను గుర్తించారు. సిట్ తుది ఛార్జీషీట్ ను దాఖలు చేసిన నేపథ్యంలో…. ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More