...
...
Next Story

Andhrapradesh : స్మార్ట్‌ ఫోన్‌ వద్ద దగ్గితే చాలు - టీబీ రోగ నిర్ధారణ..! నిమిషాల్లోనే ఏఐ ఆధారిత స్క్రీనింగ్

Swaasa AI TB screening : ఏపీ ప్రభుత్వం, టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో కృత్రిమ మేధ (AI) ఆధారిత టీబీ స్క్రీనింగ్ విజయవంతమైంది. కేవలం దగ్గు శబ్దం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించే వీలుంటుంది.

Published on: May 11, 2026 11:00 AM IST
Advertisement

Swaasa AI TB screening : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ…. కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారా క్షయ (TB) వ్యాధిని గుర్తించే వినూత్న ప్రయోగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన 'సాల్సిట్ టెక్నాలజీస్' అనే స్టార్టప్ రూపొందించిన 'శ్వాస' (Swaasa) అనే ఏఐ యాప్ ద్వారా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ సాగింది.

'శ్వాస' ఏఐ టెక్నాలజీ టీబీ గుర్తింపు (representative image) (unsplash image)
'శ్వాస' ఏఐ టెక్నాలజీ టీబీ గుర్తింపు (representative image) (unsplash image)

సాధారణంగా టీబీ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులను గుర్తించాలంటే ఎక్స్‌రే, కళ్లె పరీక్షలు తప్పనిసరి. అయితే మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద పైలట్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్ సి) లో స్వాసా తన ఏఐ-ఆధారిత శ్వాసకోశ స్క్రీనింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా ఏఎన్ఎంలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, బాధితుల దగ్గు శబ్దాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌లో రికార్డ్ చేశారు. ఈ శబ్దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషించి…. ఆ వ్యక్తికి టీబీ, ఆస్తమా లేదా సిఓపిడి వంటి వ్యాధులు ఉన్నాయా లేవా అన్నది నిమిషాల్లోనే తెలియజేస్తుంది. ఒకవేళ ఏఐ సాఫ్ట్‌వేర్ రిస్క్ ఉందని సూచిస్తే….. వెంటనే వారికి ఎక్స్‌రే లేదా నాట్ పరీక్షల కోసం ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్….

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఏపీ ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కేవలం ఆరు వారాల్లోనే సుమారు 8,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టీబీ లక్షణాలు బయటపడని (Asymptomatic) వారిలో కూడా సుమారు 36 శాతం మందికి ఈ యాప్ ద్వారా వ్యాధిని గుర్తించడం సాధ్యమైంది. సాధారణ పరీక్షల కంటే ఈ ఏఐ టెక్నాలజీ వల్ల టీబీ గుర్తింపు రేటు 15 శాతం పెరిగిందని సాల్సిట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు నారాయణరావు వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలకు వరం

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఈ ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe