ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే...
సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అనకాపల్లి - చర్లపల్లి మధ్య వీటిని నడపనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.
సంక్రాంతి పండగ వేళ ప్రయాణి రద్దు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా అనకాపల్లి - చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది.ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…..అనకాపల్లి - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07479) మధ్య 2 ప్రత్యేక జనవరి 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
- ఈ ప్రత్యేక రైళ్లు అనకాపల్లి నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతాయి. మరునాడు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటాయి.
- ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.
- చర్లపల్లి - అనకాపల్లి (ట్రైన్ 07477) మధ్య మరో సర్వీస్ ఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ జనవరి 19వ తేదీన చర్లపల్లి నుంచి అర్ధరాత్రి 12.40 గంటలకు బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.
- ఈ స్పెషల్ ట్రైన్ ఎలమంచిలి, తుణి, అన్నవరం, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, అకినీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగుడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
మరోవైపు హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడవనున్నాయి. హైదరాబాద్ - విజయవాడ మధ్య జనవరి 18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి.
ఇక విజయవాడ - హైదరాబాద్ మధ్య జనవరి 17,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.40 నిమిషాలకు బయల్దేరి.. రాత్రి 10.35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటాయి.
హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్ పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

