...
...
Next Story

Hyderabad-Mangalore : హైదరాబాద్-మంగళూరు స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు

Hyderabad-Mangalore Trains :ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది.

Published on: Sep 3, 2026, 12:10:37 IST
Advertisement

పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 12 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

హైదరాబాద్-మంగళూరు ట్రైన్స్
హైదరాబాద్-మంగళూరు ట్రైన్స్

07097 హైదరాబాద్ – మంగళూరు సర్వీస్ ప్రతి బుధవారం 09.09.2026 నుండి 25.11.2026 మధ్య నడుస్తుంది. మెుత్తం 12 సర్వీసులు ఉంటాయి.

07098మంగళూరు – హైదరాబాద్ నడుమ ప్రతీ గురువారం 10.09.2026 నుండి 26.11.2026 తేదీ దాకా 12 సర్వీసులు ఉంటాయి.

ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్టాపేజీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్. యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వటకర, తలస్సేరి, కణ్ణూర్, పయ్యన్నూర్, కాన్హంగాడ్, కాసరగోడ్‌లో ఆగుతుంది.

మంగళూరు – హైదరాబాద్ రైలు(07098) సమయాల్లో కొన్ని సవరణలు చేశారు. మారిన రైలు వేళలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గుంతకల్: రాక సాయంత్రం 6:25 / బయలుదేరు సమయం సాయంత్రం 6:35

మంత్రాలయం రోడ్: రాత్రి 7:58 / బయలుదేరు సమయం 8:00

కృష్ణ: రాక రాత్రి 9:40 / బయలుదేరు సమయం 9:50

యాద్గిర్: రాక రాత్రి 10:28 / బయలుదేరు సమయం 10:30

సేడం: రాక రాత్రి 11:28 / బయలుదేరే సమయం 11:30

వికారాబాద్: రాక అర్ధరాత్రి 12:50 / బయలుదేరు సమయం 12:52

లింగంపల్లి: రాక తెల్లవారుజామున 01:33 / బయలుదేరు సమయం 01:35

బేగంపేట్: రాక 02:00 / బయలుదేరు సమయం 02:02

హైదరాబాద్ (నాంపల్లి): చేరే సమయం ఉదయం 04:00 గంటలకు.

ఈ ట్రైన్ మంగళూరు, అనంతపురం స్టేషన్ల మధ్య పాత టైమింగ్స్ ప్రకారమే నడుస్తుందని, ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఐఆర్‌సీటిసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe