తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్ పరిధిలోని డోర్నకల్, గుండ్రాతిమడుగుస్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఇంజనీరింగ్ పనుల కారణంగా 2026 ఆగస్టు నెలలో పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రయాణికులు రైలు రద్దు వివరాలను సరిచూసుకుని, ప్రయాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. దీనివల్ల కలిగే అసౌకర్యానికి దక్షిణ మధ్య రైల్వే చింతిస్తోందని పేర్కొంది.
పూర్తిగా రద్దైన ట్రైన్లు
రైలు నెంబర్. 67765 (కాజీపేట - డోర్నకల్), నెం. 67766 (డోర్నకల్ - కాజీపేట), నెం. 67767 (డోర్నకల్ - విజయవాడ), నెం. 67768 (విజయవాడ - డోర్నకల్), నెం. 67215 (విజయవాడ - భద్రాచలం), నెం. 67216 (భద్రాచలం - విజయవాడ), విజయవాడ-సికింద్రాబాద్ నడుమ రైళ్లు కూడా ఆగస్టు 15, 2026 నుండి ఆగస్టు 19, 2026 వరకు పూర్తిగా రద్దయ్యాయి.
విజయవాడ - సికింద్రాబాద్ (12713/12714): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు రద్దు.
గుంటూరు - సికింద్రాబాద్ (12705/12706): ఆగస్టు 19, 2026న రద్దు.
సికింద్రాబాద్ - భద్రాచలం (17659): ఆగస్టు 17, 18 తేదీల్లో రద్దు.
భద్రాచలం - సికింద్రాబాద్ (17660): ఆగస్టు 18, 19 తేదీల్లో రద్దు.
సికింద్రాబాద్ - మణుగూరు (12745): ఆగస్టు 17, 18 తేదీల్లో రద్దు.
మణుగూరు - సికింద్రాబాద్ (12746): ఆగస్టు 18, 19 తేదీల్లో రద్దు.
{{/usCountry}}మణుగూరు - సికింద్రాబాద్ (12746): ఆగస్టు 18, 19 తేదీల్లో రద్దు.
{{/usCountry}}విశాఖపట్నం - మహబూబ్‌నగర్ (12861): ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు.
మహబూబ్‌నగర్ - విశాఖపట్నం (12862): ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రద్దు.
కాకినాడ టౌన్ - లింగంపల్లి (12775): ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు.
లింగంపల్లి - కాకినాడ టౌన్ (12776): ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రద్దు.
పాక్షిక రద్దు
రైలు నెం. 17201 (గుంటూరు - సికింద్రాబాద్): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు గుంటూరు - కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేశారు (అంటే ఈ రైలు కేవలం కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది).
రైలు నెం. 17202 (సికింద్రాబాద్ - గుంటూరు): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు కాజీపేట - గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు అయింది.
రైలు నెం. 17033 (భద్రాచలం - బల్హర్షా): ఆగస్టు 16 నుండి ఆగస్టు 19 వరకు భద్రాచలం - వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
రైలు నెం. 17034 (సిర్పూర్ టౌన్ - భద్రాచలం): ఆగస్టు 15 నుండి ఆగస్టు 18 వరకు వరంగల్ - భద్రాచలం మధ్య పాక్షికంగా రద్దు అయింది.