వేళాంకాన్ని పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-వేళంకాన్ని మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగుతాయి. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

ట్రైన్ నెంబర్ 07125 చర్లపల్లి - వేళాంకాన్ని మధ్య 28.08.2026 నుంచి 04.09.2026 వరకు నడుస్తాయి. 07.40 చర్లపల్లిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9.10కి వేళాంకాన్ని చేరుకుంటుంది. రెండు సర్వీసులు నడుస్తాయి.
ట్రైన్ నెంబర్ 07126 వేళాంకాన్ని-చర్లపల్లి నడుమ 29.08.2026 నుంచి 05.09.2026 వరకు ట్రైన్లు నడుస్తాయి. వేళాంకాన్ని నుంచి రాత్రి 07.30కి వస్తుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
భద్రతపై సమీక్ష
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఒక భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో నిరంతరాయ, సురక్షితమైన రైలు కార్యకలాపాలు, సవాళ్లను ఎదుర్కోవడంలో జోన్ సంసిద్ధతపై సమావేశంలో చర్చించారు.
జనరల్ మేనేజర్ ట్రాక్‌ల నాణ్యత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వర్షాకాల సన్నద్ధతా చర్యలను సమీక్షించారు. భారీ వర్షాల సమయంలో స్థిరత్వాన్ని కాపాడటానికి ట్రాక్‌లపై కంకరను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున, కొత్తగా ప్రారంభించిన వంతెనలు , రైల్వే ట్రాక్ వంతెనలు, రైల్వే లైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
సురక్షిత రైలు కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులలో రైల్వే సిబ్బంది, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు కఠినమైన నియమాలను పాటించాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. చిన్నపాటి అసౌకర్యాల విషయంలో కూడా వెంటనే తెలియజేయాలని, తద్వారా సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చని ఆయన నొక్కి చెప్పారు.
{{/usCountry}}సురక్షిత రైలు కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులలో రైల్వే సిబ్బంది, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు కఠినమైన నియమాలను పాటించాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. చిన్నపాటి అసౌకర్యాల విషయంలో కూడా వెంటనే తెలియజేయాలని, తద్వారా సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చని ఆయన నొక్కి చెప్పారు.
{{/usCountry}}ట్రాక్ విభాగాల సమీపంలో పశువులు రైలు కిందపడిపోయే ప్రమాదాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని కూడా శ్రీవాస్తవ సూచించారు. వర్షాకాలంలో ఇలాంటి చర్యల ద్వారా నమ్మకమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించేందుకు, చురుకైన భద్రతా చర్యలకు జోన్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.