SCR Special Trains : చర్లపల్లి-పాట్నా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. ఈ తేదీల్లో సర్వీసులు

SCR Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది.

Published on: Jul 28, 2026, 16:25:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా ఈ రూట్‌లో నడిచే రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలేంటో చూడండి.

ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు
ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు

ట్రైన్ నెంబర్ 03253 పాట్నా – చర్లపల్లి సోమ, బుధవారాల్లో నడుస్తుంది. 03.08.2026 నుంచి 16.09.2026 వరకు 14 సర్వీసులు నడవనున్నాయి.

ట్రైన్ నెంబర్ 03254 చర్లపల్లి-పాట్నా బుధవారాల్లో 05.08.2026 నుంచి 16.09.2026 మధ్య 7 సర్వీసులు నడుస్తాయి.

రైలు నెంబర్ 03255 చర్లపల్లి- పాట్నా శుక్రవారాల్లో 07.08.2026 నుంచి 18.09.2026 మధ్య 7 సర్వీసులు నడుస్తాయి.

ఉద్యోగి ఆఫ్ ది మంత్

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో 2026 జూన్ నెలకు గాను ఐదుగురు ఉద్యోగులకు “ఎంప్లాయి ఆఫ్ ది మంత్” భద్రతా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఎస్.సి.ఆర్ అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనే మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

విధి పట్ల ఆదర్శప్రాయమైన నిబద్ధతను కనబరుస్తూ, అప్రమత్తంగా ఉంటూ అసురక్షిత పరిస్థితులను నివారించిన సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్‌లకు చెందిన ఐదుగురు ఉద్యోగులకు 'ఎంప్లాయి ఆఫ్ ది మంత్' అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఉద్యోగులు ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మెన్, సీనియర్ టెక్నీషియన్, స్టేషన్ మాస్టర్ వంటి వివిధ భద్రతా విభాగాలకు చెందినవారు. జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తించినందుకు వారిని ప్రశంసించారు.

భద్రతా సమావేశం సందర్భంగా ఇంజనీరింగ్, ఆపరేటింగ్, కమర్షియల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మొదలైన విభాగాల సీనియర్ అధికారులు నిర్వహించిన విభాగాల వారీ రాత్రి తనిఖీలను సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఈ తనిఖీల సమయంలో గమనించిన విషయాలు, గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న దిద్దుబాటు చర్యలపై ఆయన సవివరంగా సమీక్షించారు. జోన్ అంతటా నిరంతర పర్యవేక్షణ, అత్యున్నత భద్రతా ప్రమాణాలపై జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు.

వర్షాకాలంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న రోడ్డు అండర్ బ్రిడ్జిల వద్ద అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. బారికేడ్ల ఏర్పాటు, ఇరవై నాలుగు గంటలూ వాచ్‌మెన్‌ల మోహరింపు, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి నాలుగు గంటలకు ఫోటోలను పంచుకోవడం వంటి అమలులో ఉన్న వివిధ ముందుజాగ్రత్త చర్యల గురించి డివిజనల్ రైల్వే మేనేజర్లు వివరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More