Komuravelli Railway Station : సిద్దిపేట - సికింద్రాబాద్ రైళ్లు.. కొమురవెల్లిలో ఆగే టైమింగ్స్ ఇవే

Komuravelli Railway Station : జులై 26వ తేదీ నుంచి కొమురవెల్లిలో రైళ్లు ఆగనున్నాయి. సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్లు పలు సమయాల్లో కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఉన్నాయి.

Published on: Jul 23, 2026, 09:11:30 IST
By , Komuravelli
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిద్దిపేట - సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక తీపి కబురు అందించింది. ఈ మార్గంలో నడుస్తున్న డెమో రైళ్లకు ఈనెల 26వ తేదీ నుంచి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో అధికారికంగా హాల్టింగ్ (ఆగడానికి) సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్
కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తులకు, స్థానిక వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట నివ్వనుంది. కొమురవెల్లి స్టేషన్‌లో రైళ్లు ఆగే వేళలను దక్షిణ మధ్య రైల్వే క్రింది విధంగా వెల్లడించింది.

రైళ్ల టైమింగ్స్

రైలు నంబరు 77654 (సిద్దిపేట - సికింద్రాబాద్): సిద్దిపేట నుంచి బయలుదేరే ఈ డెమో రైలు కొమురవెల్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 2:38 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి.

రైలు నంబరు 77655 (సికింద్రాబాద్ - సిద్దిపేట): తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి వచ్చే ఈ రైలు కొమురవెల్లికి రాత్రి 8:04 గంటలకు చేరుకుంటుంది. ఇది కూడా బుధవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది.

రైలు నంబరు 77656 (సిద్దిపేట - సికింద్రాబాద్): సిద్దిపేట నుంచి బయలుదేరే మరో రైలు కొమురవెల్లి స్టేషన్‌లో ఉదయం 7:04 గంటలకు ఆగుతుంది. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు సేవలు అందిస్తుంది.

రైలు నంబరు 77653 (సికింద్రాబాద్ - సిద్దిపేట): మధ్యాహ్న సమయంలో ప్రయాణించే ఈ రైలు కొమురవెల్లికి మధ్యాహ్నం 12:52 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు కూడా బుధవారం మినహా అందుబాటులో ఉంటాయి.

భక్తులకు పెరగనున్న సౌలభ్యం

గతంలో సరైన రవాణా సౌకర్యాలు లేక కొమురవెల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులు రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు డెమో రైళ్లకు కొమురవెల్లి వద్ద హాల్ట్ కల్పించడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు లభించింది. ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఈ వేళలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు

సుందరమైన ప్రవేశ ద్వారంతో (పోర్టికో) కూడిన స్టేషన్ భవనాన్ని నిర్మించారు. రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో భారీ హై-లెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు. ఎండ, వానల నుంచి రక్షణ కోసం ప్లాట్‌ఫారమ్‌పై ఐదు అధునాతన షెల్టర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి ఉండటానికి విశాలమైన వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్లాట్‌ఫారమ్‌పై కూర్చోవడానికి వీలుగా త్రీ-సీటర్ బెంచీలను అమర్చారు.

టికెట్ల జారీ కోసం ఆధునిక బుకింగ్ కౌంటర్లను సిద్ధం చేశారు. స్టేషన్ వెలుపల వాహనాల రాకపోకల కోసం విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, ప్రత్యేక పార్కింగ్ వసతులను కల్పించారు. ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగుల (దివ్యాంగజన్) కోసం ప్రత్యేకంగా ఆధునిక శౌచాలయాలను నిర్మించారు. స్టేషన్‌కు చేరుకోవడానికి వీలుగా రోడ్లను చక్కగా అభివృద్ధి చేశారు. స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టేషన్ భవన ముఖద్వారాన్ని (ఆర్కిటెక్చరల్ ఎలివేషన్) తీర్చిదిద్దారు.

కొమరవెల్లి మల్లన్న స్వామి వైభవాన్ని, స్థానిక అడవులు, జంతుజాలాన్ని (ఫ్లోరా అండ్ ఫౌనా) ప్రతిబింబించేలా గోడలపై అద్భుతమైన మురళీ చిత్రాలను (మ్యూరల్ పెయింటింగ్స్) వేయించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More