అయ్యప్ప భక్తులకు శుభవార్త - శబరిమలకు మరో 54 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వో మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా… తాజాగా మరో 54 రైళ్లను కూడా ప్రకటించింది. వీటిలో కొన్ని ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Published on: Nov 9, 2025, 13:35:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇటీవలనే చర్లపల్లి, నర్సాపుర్, మచిలీపట్నం నుంచి 50 రైళ్లను ప్రకటించగా… తాజాగా వేర్వురు స్టేషన్ల నుంచి మరో 54 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

మరో 54 ప్రత్యేక రైళ్లు…

కొద్దిరోజులుగా శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు తాజాగా 54 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం… ఈ రైళ్లు కాకినాడ, నాందేడ్​, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది.

ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17, 2025 నుంచి జనవరి 20, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు ఏపీ, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ కేరళలోని కొల్లాం జంక్షన్ లేదా కొట్టాయం వరకు నడవనున్నాయి.

కాకినాడ టౌన్ - కొట్టాయం (07109/07110) మధ్య రాను పోను కలిపి మొత్తం 18 రైళ్లు అందుబాటులో ఉంటాయి. సోమ, మంగళవారం తేదీల్లో రాకపోకలు ఉంటాయి. ఈ ట్రైన్స్ రాజమండ్రి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

ఇక హెచ్.ఎస్. నాందేడ్ - కొల్లాం (07111/07112) మధ్య రానుపోను కలిపి మొత్తం 18 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. బుధ, శనివారం తేదీల్లో జర్నీ ఉంటుంది.ఈ ప్రత్యేక రైళ్లు నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, రేణిగుంట, తిరుపతి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

మరోవైపు హైదరాబాద్ లోని చర్లపల్లి - కొల్లాం (07113/07114) మధ్య రానుపోను కలిపి 18 ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, కడప, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More