ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు 50 ప్రత్యేక రైళ్లు - ఆగే స్టేషన్లు, ట్రైమింగ్స్ ఇవే

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి, నర్సాపుర్, మచిలీపట్నం నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.

Published on: Nov 8, 2025, 13:35:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

చర్లపల్లి టు కొల్లం…!

చర్లపల్లి - కొల్లం-చర్లపల్లి (07107/07108) మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 07107 రైలు నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) చర్లపల్లిలో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరుతుంది. మరునాడు రాత్రి 10గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇక 07108 ట్రైన్ నవంబర్‌…. 19, 26, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో (బుధవారం) తెల్లవారుజామున 2.30గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు…నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంటు మీదుగా కొల్లంకు చేరుకుంటుంది.

నర్సాపూర్ టు కొల్లం….

మరోవైపు ఏపీలోని నర్సాపూర్ నుంచి కొల్లంకు 20 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్‌-కొల్లం (07105) రైలు…. నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

ప్రతి ఆదివారం ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇక కొల్లం-నర్సాపూర్‌ (07106) రైలు నవంబర్‌ 18, 25, డిసెంబర్‌ 2, 9, 16, 23, 30 జనవరి 6, 13, 20 తేదీల్లో ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ప్రతి ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు… పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి మీదుగా కాయంకులం స్టేషన్లలో ఆగుతుంది.

మచిలీపట్నం టు కొల్లం….

ఇక మచిలీపట్నం - కొల్లం మధ్య కూడా 10 ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయి. ట్రైన్ నెంబర్ 07101 రైలు నవంబర్‌ 14, 21, 28, డిసెంబర్‌ 26, జనవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సంబంధిత తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.

ఇక కొల్లం – మచిలీపట్నం (07102) రైలు నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 28, జనవరి 3 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట మీదుగా కాయంకులం స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More