SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు, రూట్లు ఇవే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. పండగల వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్స్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: Mar 10, 2026, 05:10:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండగల వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరువనంతపురం - సంత్రాగచ్చి, పోదనూర్ – బరౌనీ రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ప్రత్యేక రైళ్లు ((PTI Photo))
ప్రత్యేక రైళ్లు ((PTI Photo))

ప్రత్యేక రైళ్లు - రూట్లు ఇవే….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం....తిరువనంతపురం - సంత్రాగచ్చి(ట్రైన్ నెంబర్ 06081) మధ్య మార్చి 13, 20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ 14:15 గంటలకు బయల్దేరి.. రెండో రోజు మధ్యాహ్నం 14:15 గంటలకు సంత్రాగచ్చి స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక సంత్రాగచ్చి - తిరువనంతపురం(06082) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మార్చి 10,17 తేదీల్లో ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 14:20 నిమిషాలకు బయల్దేరి... రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు... కొల్లాం, కాయంకులం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనాశేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, తిరుత్తని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి.

ఇక పోదనూర్ – బరౌనీ(ట్రైన్ నెంబర్ 06021) మధ్య మార్చి 16,23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ తెల్లవారుజామున 04:30 గంటలకు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు బరౌనీ చేరుకుంటాయి. బరౌనీ – పోదనూర్(06022) మధ్య మార్చి 19,26 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. బరౌనీ నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు ట్రైన్ బయల్దేరి... రెండో రోజు రాత్రి 11.30 నిమిషాలకు పోదనూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చిరాలా, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాఘజ్‌నగర్, బల్హార్షా, చందర్పూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, జబల్‌పూర్, సత్నా, మణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ చెహోకి, చునార్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా, దానాపూర్, పాటలిపుత్ర, హాజీపూర్, షాహ్‌పూర్ పట్టోరీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More