ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. భారత రైల్వే రంగంలో అత్యంత కీలకమైన 18వ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జూన్ 1, 2026 (సోమవారం) నుండి పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మే 4, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఈ కొత్త జోన్ అధికారికంగా రూపుదిద్దుకుంది.

విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా (హెడ్‌క్వార్టర్స్) పనిచేయనున్న ఈ కొత్త రైల్వే జోన్ విస్తరణ, పాలనాపరమైన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. ఈ కొత్త జోన్‌కు మొదటి జనరల్ మేనేజర్‌గా సందీప్ మాథుర్ బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రైల్వే లైన్ల సామర్థ్యం పెంపు, మూడో, నాలుగో ట్రాక్ లైన్ల అభివృద్ధి వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ జోన్‌కు నియమితులైన ఇతర ముఖ్య అధికారులు
- వినీత్ కుమార్ – ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్
- టి.కె. సిన్హా – ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్
- బి.ఎస్.కె. రాజ్ కుమార్ – ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్
- పి. హరిప్రసాద్ – ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్
- ఎల్.వి.ఎస్.ఎస్. పాత్రుడు – ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్
- డి. సత్యనారాయణ – చీఫ్ కమర్షియల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్)
నాలుగు డివిజన్లు.. మూడు రాష్ట్రాల నెట్‌వర్క్
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి మొత్తం నాలుగు రైల్వే డివిజన్లు వస్తాయి. అవి: విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు.
ఈ జోన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల రైల్వే నెట్‌వర్క్‌ను కవర్ చేస్తుంది. దాదాపు 17,000 మంది ఉద్యోగుల నిర్వహణతో పాటు, భారీ స్థాయిలో సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను ఈ జోన్ నియంత్రించనుంది.
ప్రస్తుతం ఈ రైల్వే జోన్ సిరిపురంలోని విఎంఆర్డిఎ (VMRDA) కి చెందిన ప్రతిష్టాత్మక ఐకానిక్ బిల్డింగ్ ‘ది డెక్’నుండి తాత్కాలికంగా పనిచేయనుంది. కాగా విశాఖపట్నంలోని ముడసర్లోవ వద్ద శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8, 2025న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}ప్రస్తుతం ఈ రైల్వే జోన్ సిరిపురంలోని విఎంఆర్డిఎ (VMRDA) కి చెందిన ప్రతిష్టాత్మక ఐకానిక్ బిల్డింగ్ ‘ది డెక్’నుండి తాత్కాలికంగా పనిచేయనుంది. కాగా విశాఖపట్నంలోని ముడసర్లోవ వద్ద శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8, 2025న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}రాష్ట్ర విభజన చట్టం-2014 హామీలలో విశాఖపట్నం రైల్వే జోన్ అత్యంత ప్రధానమైనది. గతంలో విశాఖపట్నం డివిజన్ ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది. దీనివల్ల ఏపీకి వచ్చే ఆదాయం, కొత్త రైళ్లు, నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకంగా 'సౌత్ కోస్ట్ రైల్వే' ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే లైన్ల విస్తరణ, కొత్త రైళ్ల లభ్యత, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక సరుకు రవాణా వేగవంతం కానున్నాయి.