Special Trains : సంత్రగాచి-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక రైళ్లు
South Eastern Railway : పుట్టపర్తి సత్య సాయి బాబా 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా రైళ్లను ప్రకటించింది.
శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway) సంత్రగాచి-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం (SSPN) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 2026 నవంబర్ 17 నుండి నవంబర్ 24 వరకు జరగనున్న ఈ ఉత్సవాల కోసం, పశ్చిమ బెంగాల్ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుండి ప్రశాంతి నిలయానికి ప్రయాణించే భక్తుల సౌకర్యార్థం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

రైలు నంబర్ 08031 సంత్రగాచి – శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం ప్రత్యేక రైలు, మంగళవారాల్లో (నవంబర్ 17, 24) మధ్యాహ్నం 12:40 గంటలకు సంత్రాగాచి నుండి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 9:30 నిమిషాలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08032 బుధవారాల్లో (నవంబర్ 18, 25) రాత్రి 11 గంటలకు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం నుండి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3:18 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. మూడో రోజు ఉదయం సంత్రాగాచి చేరుకుంటుంది.
ఈ రైలు ఖరగ్‌పూర్, కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ధర్మవరం స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు, భక్తులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
దక్షిణ కోస్తా రైల్వే కూడా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల మీదుగా కర్ణాటకలోని యలహంక(బెంగళూరు) వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
శ్రీకాకుళం – యలహంక
రైలు నెం. 08555 (శ్రీకాకుళం రోడ్ - యలహంక) : నవంబర్ 20న (శుక్రవారం) సాయంత్రం 4:00 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 21 (శనివారం) మధ్యాహ్నం 3:00 గంటలకు యలహంక చేరుకుంటుంది.
రైలు నెం. 08556 (యలహంక - శ్రీకాకుళం రోడ్) : తిరుగు ప్రయాణంలో నవంబర్ 24న (మంగళవారం) సాయంత్రం 5:00 గంటలకు యలహంకలో బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 25 (బుధవారం) సాయంత్రం 5:15 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
యలహంక – విజయవాడ
రైలు నెం. 07246 (యలహంక - విజయవాడ) : నవంబర్ 21న (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు యలహంకలో బయలుదేరుతుంది. నవంబర్ 22 (ఆదివారం) ఉదయం 7:45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
రైలు నెం. 07245 (విజయవాడ - యలహంక): తిరుగు ప్రయాణంలో నవంబర్ 23న (సోమవారం) రాత్రి 11:50 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 24 (మంగళవారం) మధ్యాహ్నం 3:00 గంటలకు యలహంక చేరుకుంటుంది.
శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి), ధర్మవరం, అనంతపురం, గుంతకల్, డోన్, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


