ఏపీలోని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - వెంటనే అప్డేట్ చేసుకోండి..!
రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 నుంచి 30 వరకు ఈ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.
ఏపీ స్కూళ్లలో ఆధార్ క్యాంపులు
ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 30వ తేదీ వరకు ఈ క్యాంపుల ద్వారా సేవలను పొందవచ్చు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు వారి కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. వీరి సంఖ్య 8 లక్షలకుపైగానే ఉంది. ఇక 15 ఏళ్ల పైబడిన వారు మరో 7 లక్షల మందికిపైగా ఉంటారని లెక్కలు చెబుతచున్నాయి. కాబట్టి వీరంతా వారి పాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి.
పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.
చిన్నారులను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి.
ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డును తీసుకుని ఉంటే.. వారికి 7 సంవత్సరాల వయస్సులోపు బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని, లేదంటే వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయవచ్చని యూఐడీఏఐ ఇటీవల ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు.
బాల్యంలో ఆధార్ తయారు చేసేటప్పుడు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అభివృద్ధి చెందదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం.
News/Andhra Pradesh/ఏపీలోని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - వెంటనే అప్డేట్ చేసుకోండి..!
News/Andhra Pradesh/ఏపీలోని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - వెంటనే అప్డేట్ చేసుకోండి..!