ప్రయాణికులకు శుభవార్త... నరసాపురం-అరుణాచలం మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ ఇదే

Narasapur Tiruvannamalai Special Trains : పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం - తిరువణ్ణామలై(అరుణాచలం) మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.

Published on: Sep 23, 2026, 07:27:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Narasapur Tiruvannamalai Special Trains : రాబోయే పండగల సీజన్, కార్తీక మాసంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

నరసాపురం-అరుణాచలం మధ్య ప్రత్యేక రైళ్లు
నరసాపురం-అరుణాచలం మధ్య ప్రత్యేక రైళ్లు

రైళ్ల టైమింగ్స్ - షెడ్యూల్ వివరాలు:

రైలు నంబర్ 07291 (నరసాపురం - తిరువణ్ణామలై) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 04 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నరసాపురంలో మధ్యాహ్నం 13:00 గంటలకు (1:00 PM) బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. ఇది మొత్తం 9 ట్రిప్పులు సేవలు అందిస్తుంది.

రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై - నరసాపురం) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 05 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం రాత్రి 20:00 గంటలకు (8:00 PM) తిరువణ్ణామలైలో బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఇది కూడా మొత్తం 9 ట్రిప్పులు నడుస్తుంది.

స్టాపేజీలు (ఆగే స్టేషన్లు):

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఒక 2nd ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 14 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ మరియు 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/గార్డ్ వ్యాన్లు (SLR) అందుబాటులో ఉంటాయి. అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసే భక్తులతో పాటు…. తిరుపతి క్షేత్రానికి వెళ్లేవారికి కూడా ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, 'రైల్ వన్' (RailOne) యాప్ ద్వారా సేవలు పొందవచ్చని రైల్వే అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More