పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి….. వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పార్వతీపురం - ఏక్తా నగర్ (గుజరాత్) స్టేషన్ల మధ్య ప్రత్యేక ఆన్-డిమాండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
రైలు నంబర్ 08519 (పార్వతీపురం నుంచి ఏక్తా నగర్) :

ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 28న (బుధవారం) మధ్యాహ్నం 15:00 గంటలకు పార్వతీపురంలో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 16:50 గంటలకు విజయనగరం చేరుకుని, 17:00 గంటలకు ముందుకు సాగుతుంది. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు ఈ రైలు ఏక్తా నగర్ చేరుకుంటుంది.
రైలు నంబర్ 08520 (ఏక్తా నగర్ నుంచి పార్వతీపురం) :
తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 01న (ఆదివారం) రాత్రి 23:30 గంటలకు ఏక్తా నగర్‌లో బయలుదేరుతుంది. నవంబర్ 03వ తేదీ మధ్యాహ్నం 14:45 గంటలకు విజయనగరం చేరుకుని 14:50 కి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:00 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
ముఖ్యమైన స్టాప్‌లు (ఆగే స్టేషన్లు):
పార్వతీపురం, ఏక్తా నగర్ మధ్య రెండు వైపులా ఈ రైళ్లు…. పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, వాడి, సోలాపూర్, పుణే, లోనావాలా, కల్యాణ్ , వసాయ్ రోడ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
మొత్తం 22 బోగీలతో నడిచే ఈ ప్రత్యేక రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు సీట్లు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. పండుగ ప్రయాణ రద్దీని అధిగమించేందుకు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ఉపయోగించుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.