ప్రయాణికుల రద్దీ… విశాఖ - విజయవాడ మధ్య జనసాధారణ్ స్పెషల్ రైళ్లు! ఈనెల 24 వరకు సేవలు
ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 21 నుండి 24 వరకు రోజువారీ సర్వీసులు నడుస్తాయి.
దసరా పండుగ సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే సాధారణ ప్రయాణికుల కోసం దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ‘జనసాధారణ్ స్పెషల్’ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

మొత్తం 4 సర్వీసులు…
ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 21, 2026 నుండి అక్టోబర్ 24, 2026 వరకు మొత్తం 4 ట్రైప్‌లు (రోజువారీ సర్వీసులు) నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. పండుగ వేళ రైళ్లలో రద్దీ పెరిగి సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రైన్ నంబర్ 07717 (విశాఖపట్నం - విజయవాడ): ఈ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజూ ఉదయం 09:40 గంటలకు బయలుదేరి, సాయంత్రం 16:00 (4:00) గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
- దువ్వాడ : ఆగమనం 10:20 , నిష్క్రమణ 10:22
- అనకాపల్లి : ఆగమనం 10:38 , నిష్క్రమణ 10:40
- తుని : ఆగమనం 11:20 , నిష్క్రమణ 11:22
- సామర్లకోట : ఆగమనం 12:10 , నిష్క్రమణ 12:12
- రాజమండ్రి : ఆగమనం 12:55 , నిష్క్రమణ 12:57
- తాడేపల్లిగూడెం : ఆగమనం 13:35 , నిష్క్రమణ 13:37
- ఏలూరు: ఆగమనం 14:06 , నిష్క్రమణ 14:08
- విజయవాడ : చేరుకునే సమయం 16:00
ట్రైన్ నంబర్ 07718 (విజయవాడ - విశాఖపట్నం) : ఈ రైలు విజయవాడలో ప్రతిరోజూ సాయంత్రం 17:30 (5:30) గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 23:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
- ఏలూరు : ఆగమనం 18:23 , నిష్క్రమణ 18:25
- తాడేపల్లిగూడెం : ఆగమనం 19:03 , నిష్క్రమణ 19:05
- రాజమండ్రి : ఆగమనం 20:05 , నిష్క్రమణ 20:10
- సామర్లకోట : ఆగమనం 20:53 , నిష్క్రమణ 20:55
- తుని : ఆగమనం 21:38 , నిష్క్రమణ 21:40
- అనకాపల్లి : ఆగమనం 22:24 , నిష్క్రమణ 22:26
- దువ్వాడ : ఆగమనం 23:10 , నిష్క్రమణ 23:12
- విశాఖపట్నం : చేరుకునే సమయం 23:50
దసరా పండుగ తర్వాత స్వస్థలాల నుండి విధులకు లేదా నివాస ప్రాంతాలకు తిరిగి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక జనసాధారణ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చని రైల్వే శాఖ సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

