స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్.. ఏపీ, తెలంగాణలో అతివేగంతో సగటున రోజుకు 15 మరణాలు
ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం, తాజాగా తెలంగాణ బస్సు ప్రమాదం.. వీటికి ప్రధాన కారణాలు అతివేగం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అతివేగంతో రోజుకు సగటున 15 మరణాలు సంభవిస్తున్నాయి.
ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే తాజాగా తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజూ సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో మాత్రమే, రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణా నష్టానికి ఇది ఉదాహరణ.
తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. అతివేగం వల్ల సంభవించే మరణాలలో రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ.
అన్ని రోడ్డు ప్రమాదాలలో 80 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలకు అతివేగం ఒక ప్రధాన ముప్పుగా మారిందని, దీనికి కారణం అతివేగం అని రోడ్డు భద్రతా నిపుణులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులే బాధితులు, అయితే హైవేలపై, నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు తరచుగా అధిక వేగంతో ఢీకొనే ప్రమాదాలలో ఉంటాయి.
చాలా ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్డు కర్వ్ ఉన్న ప్రాంతంలో, జంక్షన్లలో, సరైన సూచికలు లేని ప్రదేశాల్లో ప్రమాదాలు కనిపిస్తుంటాయి. స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, కనిపించే సంకేతాలను ఏర్పాటు చేయాలని పలువురు అధికారులను కోరుతూనే ఉన్నారు. స్పీడ్ లేజర్ గన్‌లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, అవసరమైనది మెరుగైన రహదారి రూపకల్పన, సరైన గుర్తులు, స్థిరమైన సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మరణాలు 1.48 లక్షల (2017) నుండి 1.68 లక్షల (2023)కు పెరిగాయి. ఇందులో దాదాపు 70 శాతం మరణాలు అతి వేగం వల్లే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


