చేవెళ్ల రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. రూ.2 లక్షలు ప్రకటించిన కేంద్రం!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందజేయనున్నట్టుగా తెలిపింది.

Published on: Nov 3, 2025, 12:55:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా వెల్లడించారు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదం
చేవెళ్ల రోడ్డు ప్రమాదం

చేవెళ్ల ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు పొన్నం. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను మాత్రమే పోలీసులు గుర్తించారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు

ప్రమాదం జరిగిన వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణాకమిషనర్, ఫైర్ డీజీకి ఆదేశాలు వెళ్లాయి. సచివాలయంలో కంట్రోల్‌రూమ్‌ నంబర్లు 9912919545, 9440854433గా ఉన్నాయి.

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. తాండూరు పట్టణంలోని గాందీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ప్రమాదంలో చనిపోయారు. తనూష, సాయి ప్రియ, నందిని మృతి చెందారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో ముగ్గురు చదువుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని.. కన్నీరుమున్నీరయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More