...
...
Next Story

ఏపీలో మళ్లీ చెలరేగిన రాజకీయ మంటలు.. రాయచోటి వైసీపీ ఆఫీస్‌కు నిప్పు.. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి!

స్థానిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ రాజకీయ మంటలు చెలరేగాయి. రాయచోటి వైసీపీ ఆఫీస్‌కు నిప్పు అంటించారు. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరిగింది.

Updated on: Oct 16, 2026, 13:19:22 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల నామినేషన్ల వేళ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. రాయచోటి, పుంగనూరు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న సంఘటనలతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఒకవైపు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడం, మరోవైపు లోక్‌సభ సభ్యుడి వాహనంపై దాడి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి
ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు తీవ్ర దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేషన్ల నేపథ్యంలో వైసీపీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో భవన ప్రాంగణంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, కార్లతో సహా సుమారు 10 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

దాడి జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి భవనం లోపలే ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గ్రహించిన అనుచరులు, భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. ఈ దాడికి టీడీపీ శ్రేణులే కారణమని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డి స్థానిక మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు పుంగనూరుకు చేరుకున్నారు. మిథున్‌రెడ్డి నామినేషన్ సెంటర్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని తీవ్రస్థాయిలో రాళ్ల దాడికి దిగారు. ఎంపీ వాహనంతో పాటు వెంట ఉన్న ఇతర నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీలు రంగంలోకి దిగి పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. రాయచోటి, పుంగనూరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం దళాలను భారీగా మోహరించారు. రాళ్ల దాడి, ఆస్తుల ధ్వంసానికి బాధ్యులైన వారిపై వీడియోగ్రఫీ ఆధారంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks