Tomato Price : రైతులకు ఊరట.. మార్కెట్‌లో పెరిగిన టమాట ధరలు.. 1 కేజీకి ఎంత ఉందంటే?
Tomato Price : రాయలసీమలో టమోట ధరలు పెరగుతున్నాయి. మార్కెట్‌లోకి పంట రాక తగ్గుతుండటంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
రాయలసీమ వ్యాప్తంగా చిల్లర మార్కెట్లలో టమాటా ధరలు పెరిగాయి. కిలోకు సుమారు రూ. 40కి పెరగడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ధరల పతనం తర్వాత రైతులకు ఊరట లభించింది. ధరలు పెట్టుబడి ఖర్చుల కంటే తక్కువకు పడిపోవడంతో దాదాపు మూడు నెలల పాటు రైతులు నష్టాలను చూశారు. దీంతో కొందరు తమ పంటను పొలాల్లోనే వదిలివేయవలసి వచ్చింది.

ఏప్రిల్-మే సీజన్‌లో దిగుబడులు తగ్గడమే ఇటీవలి పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. సోమవారం కర్నూలులో టోకు ధర కిలోకు సుమారు రూ. 25గా ఉందని మార్కెట్ అధికారులు తెలిపారు. చిల్లర మార్కెట్‌లో టమాట ధరలు కిలోకు రూ.40 వరకు పలుకుతున్నాయి. స్థానిక ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో డిమాండ్‌ను తీర్చడానికి వ్యాపారులు మదనపల్లె నుండి టమోటాలను తెప్పిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని మార్కెట్లలో కూడా ఇలాంటి ధోరణులే కనిపించాయి. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పెట్టుబడిని తిరిగి పొందిన తర్వాత కనీసం 30 శాతం లాభం ఆశించవచ్చని రైతులు చెబుతున్నారు. అయితే ఈ సీజన్‌లో దిగుబడి తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
మార్కెట్‌కు టమోట రాకలు తక్కువగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రస్తుతం పంచ రాక తక్కువగా ఉందని, డిమాండ్ స్థిరంగా ఉందన్నారు. ఈ ధోరణి కొనసాగితే, టమాటా ధరలు మరింత పెరగవచ్చు అని చెప్పారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో గత రెండు రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర సుమారు రూ.15 మేర వృద్ధి చెందింది. మొదటి రకం టమాటాలు కిలో రూ.25 చొప్పున, రెండో రకం టమాటాలు కిలో రూ.19 చొప్పున విక్రయించారు.
మార్చి మూడవ వారం వరకు ధరలు కిలో రూ.10 కంటే తక్కువగానే ఉండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదల కొంత ఆర్థిక అండగా నిలుస్తోందన్నారు. మదనపల్లెతో పాటు, చిత్తూరులోని పాలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, కర్ణాటకలోని చింతామణి, శ్రీనివాసపురం వ్యవసాయ మార్కెట్ కమిటీల వంటి వ్యాపార కేంద్రాల్లోనూ టమాటా క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వంటి పరిస్థితులు నెలకొనడంతో కొనుగోలుదారులు ఇప్పుడు మదనపల్లె, చింతామణి మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


