...
...
Next Story

ఇక ఎన్నికల్లో పోటీచేయాలి.. ఆల్ ది బెస్ట్.. ఏపీ స్థానిక పోరుపై సుప్రీంకోర్టు కామెంట్స్

Supreme Court : ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలపై వైసీపీ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Published on: Oct 27, 2026, 17:18:33 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల వివాదంపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. నామినేషన్ల గడువును పొడిగించాలని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనితో ఈ వ్యవహారంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి నిరాశే ఎదురైంది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం వెలువరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎన్నికలను వాయిదా వేయాలనే మీ ఉద్దేశం లేదా ట్రాప్‌లో మేం పడబోం" అని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ల సమయం ఇప్పటికే ముగిసినందున విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. "ఇక ఎన్నికల సమయం వచ్చింది.. పోటీ చేయండి, ఆల్ ది బెస్ట్" అని వ్యాఖ్యానిస్తూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగించారు.

తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పక్షం అడ్డుకుంటోందని, బెదిరింపులకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నామినేషన్ల సమయాన్ని పొడిగించి తమకు అవకాశం కల్పించాలని కోరారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేశామని, పరిశీలనల అనంతరం కొన్ని ప్రాంతాల్లో అర్హత ప్రకారం గడువును కూడా పొడిగించామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై స్పందించిన సుప్రీంకోర్టు, పోలింగ్ కేంద్రాల్లో, నామినేషన్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సురక్షితంగా భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఎన్నికల సవాళ్లు లేదా పిటిషన్లు వచ్చినప్పుడు ఈ ఫుటేజ్ సాక్ష్యంగా ఉపయోగపడుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks