...
...
Next Story

శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ అమ్మకాలు వద్దని చెప్పాం కదా : హైకోర్టు

శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ అమ్మకాలపై కేరళ హైకోర్టు మండిపడింది. రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Published on: Dec 4, 2025, 18:08:29 IST
Advertisement

శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ(రసాయనాలు కలిపిన కుంకుమ) అమ్మకం నిషేధం విధించినప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోందని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం.. డిస్ట్రిబ్యూటర్ ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ అని సంస్థకు నోటీసులు జారీ చేసింది.

శబరిమల అయ్యప్ప
శబరిమల అయ్యప్ప

ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ పంపిణీ చేసిన కుంకుమను విక్రయించేందుకు వివిధ విక్రేతలకు సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎన్విరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ల్యాబ్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు ముందే సమాధానం చెప్పాలని కోర్టు ఆ రెండు సంస్థలను ఆదేశించింది.

ఎరుమేలి గ్రామ పంచాయతీ ప్రాంతంలో సింథటిక్ కుంకుమ అమ్మకాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా పంపిణీ జరుగుతుందని కోర్టుకు తెలిసిన తరువాత ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంపిణీ చేసిన కుంకుమ సహజ పదార్థాల నుండి లభించిందో లేదో నిర్ధారించడం సాధ్యం కాదని ఎరుమేలి పంచాయతీ తెలిపింది.

కోర్టు గతంలో రసాయనాల కుంకుమపై నిషేధం విధించినా.. కుంకుమ అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని తాము కనుగొన్నామని ధర్మాసనం పేర్కొంది. 'ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అనుమతించలేం. ఐడియల్ ఎంటర్ప్రైజెస్ అని పిలిచే సంస్థ ప్రధాన పంపిణీదారు అని ప్రాథమికంగా తెలుస్తోంది.' అని కోర్టు పేర్కొంది.

నవంబర్ 7, 12 తేదీల్లో శబరిమలలోని సన్నిధానం ప్రాంతంలోని భక్తులకు రసాయనికంగా తయారైన లేదా సింథటిక్ కుంకుమను తయారు చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి అమ్మకందారులను అనుమతించరాదని కోర్టు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇది కొనసాగడంపై మండిపడింది. ఐడియల్ ఎంటర్ప్రైజెస్, ఎన్విరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ల్యాబ్ సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ డిసెంబర్ 5వ తేదీన జరగనుంది.

15 లక్షలు దాటిన భక్తులు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks