ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే లాంగ్ వీకెండ్.. రథసప్తమికి తిరుమల లేదంటే మేడారానికి ప్లాన్ చేయండి
ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే.. లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. దీనితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మేడారం జాతర, తిరుమల రథసప్తమికి ఎక్కువగా వెళ్తున్నారు.
ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా ఎదురుచూసేది లాంగ్ వీకెండ్ కోసం. ముందో.. వెనకో.. ఒక్క లీవ్ తీసుకుంటే.. మూడు, నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇప్పుడు కూడా మీరు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం ఒక్క లీవ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో మీరు అనేక ప్రాంతాలను తిరిగి రావొచ్చు.

జనవరి 23వ తేదీన శుక్రవారం లీవ్ తీసుకుంటే.. జనవరి 24న నాలుగో శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే కలిసి వస్తుంది. నాలుగు రోజులు కలిసి రావడంతో మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే తిరుమల రథసప్తమి, మేడారం మహాజాతరకు వెళ్లి రావొచ్చు. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయంలోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ లీవ్స్ మాత్రమే కాదు.. బ్యాంకు ఉద్యోగులు జనవరి 27వ తేదీన సమ్మె కూడా చేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తిరుమల ప్లాన్ చేయండి
ఈ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ సమయంలో తిరుమలకు వెళ్లాలి అనుకునేవారు రథసప్తమి వేడుకలను చూసి రావొచ్చు. జనవరి 25వ తేదీన రథసప్తమి సందర్భంగా ఒకేరోజు స్వామివారికి వాహనసేవలు ఉంటాయి. ఆలయ మాఢవీధుల్లో స్వామివారు భక్తులను దర్శనమిస్తారు.
- జనవరి 25వ తేదీ తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఈ రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు ఉంటుంది.
అరసవల్లి సూర్యదేవాలయం
రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయాన్ని కూడా చాలా మంది దర్శించుకుంటారు. జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కార్యక్రమాలు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించారు. రథసప్తమి రోజున క్షీరాభిషేకం టికెట్ ధరను ప్రభుత్వం రూ. 500 గా నిర్ణయించింది. రూ. 100, రూ. 500 ధరలతో ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా ఉంటాయి.
మేడారం జాతర
ఇక తెలంగాణలో జరిగే మేడారం మాహాజాతరకు ఇప్పటికే జనాలు భారీగా వెళ్తున్నారు. జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. కానీ ముందు నుంచే ఇక్కడ వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటారు. లాంగ్ వీకెండ్ సందర్భంగా మేడారం వెళ్లిరావొచ్చు. అంతేకాదు దగ్గరలోనే అనేక పర్యాటక ప్రాంతాలు కూడా కవర్ చేయవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


