ఈ రథసప్తమి నుంచి ఈ రాశుల వారి జీవితంలో వెలుగులు.. డబ్బు, ఆస్తి లాభం, వాహన యోగం ఇలా ఎన్నో
చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఏ రాశుల వారికి రథసప్తమి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.
జనవరి 25న రథసప్తమి. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఏ రాశుల వారికి రథసప్తమి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.

శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
మేష రాశి
మేష రాశి వారికి సూర్యుని మార్పు వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రయత్నాలు చేపడితే బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి, ఉద్యోగం, విదేశీ ఉద్యోగాలు వంటి ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. షేర్లు వంటివి అంచనాలకు మించి లాభాలను కలిగిస్తాయి. వ్యాపారులకి కూడా ఇది అద్భుతమైన సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రవి సప్తమ స్థానంలో ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రాశి వారు ధన లాభాన్ని పొందుతారు. రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. సంస్థకు లాభం వస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి రవి సంచారం బాగా కలిసి వస్తుంది. విజయాలు అందుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి. మనశ్శాంతి ఉంటుంది. ఆస్తి వివాదాలు కూడా తొలగిపోతాయి. వాహన యోగం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. రవి సంచారం ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలను వింటారు. పదవులు కూడా లభిస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


