ఆరు నెలల పాటు ఈ రాశుల వారికి కష్టాలే ఉండవు.. డబ్బు, కొత్త అవకాశాలు, ఆస్తి లాభంతో పాటు ఎన్నో!
ఆరు నెలల పాటు ఉత్తరాయణం ఉంటుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.
సూర్యుడిని గ్రహాలకు రాజు అని అంటారు. సూర్యుడు ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఆరు నెలల పాటు ఉత్తరాయణం ఉంటుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి.

ఆర్థికపరంగా, కెరీర్ పరంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఈ రాశులలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
ఉత్తరాయణ పుణ్యకాలం
ఆరు నెలల పాటు సూర్యుడు ఉత్తరం వైపు పయనించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రయాణం చేయడంతో ఉత్తరాయణం పూర్తవుతుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కానీ ఉత్తరాయణంలో మాత్రం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
ఉత్తరాయణ పుణ్యకాలం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటి నుంచో అనుకున్న పెద్ద పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అనుకున్న కోరికలు కూడా తీరుతాయి. పని ప్రదేశంలో కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












