జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారం శుద్ధి కర్మాగారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జియో మైసూర్ సర్వీసెస్’, ‘త్రివేణి ఎర్త్ మూవర్స్’ సంస్థల యాజమాన్యాలను, కార్మికులను సీఎం చంద్రబాబు అభినందించారు.

జొన్నగిరి ప్రాంతానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'పూర్వం అశోక చక్రవర్తి పరిపాలించిన నాలుగు ప్రధాన రాజధానులలో ఒకటైన 'సువర్ణగిరి'.. నేటి జొన్నగిరి. ఇక్కడికి సమీపంలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలే అందుకు నిదర్శనం. ఒకప్పుడు బంగారం, రత్నాలతో విలసిల్లిన ఈ ప్రాంతం పేరు కాలక్రమేణా జొన్నగిరిగా మారింది. ఇక్కడ మళ్లీ బంగారు గని ప్రారంభమైనందున.. ఈ గ్రామం పేరును అధికారికంగా ‘స్వర్ణగిరి’గా మార్చుకుందామా?' అని చంద్రబాబు అడిగారు.
ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కేవలం పరిశ్రమకే పరిమితం కాకుండా స్థానిక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే ఈ గ్రామాన్ని సదరు సంస్థలు దత్తత తీసుకోనున్నాయని, దీనిని అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ‘స్వర్ణగిరి మోడల్ విలేజ్’గా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక విశ్లేషణలను సీఎం చంద్రబాబు వివరించారు. 'జొన్నగిరి (స్వర్ణగిరి) గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు కోసం కంపెనీలు రూ.405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తితో ప్రారంభించి.. క్రమంగా ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో దీనిని 50 మెట్రిక్ టన్నుల మార్కుకు చేర్చాలని ప్రణాళికలు రూపొందించారు.' అని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం భారతదేశం ఏటా దాదాపు 800 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని చంద్రబాబు అన్నారు. క్రూడాయిల్ తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద దిగుమతి అని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే బంగారం ఉత్పత్తి వల్ల దేశ విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయన్నారు.
{{/usCountry}}ప్రస్తుతం భారతదేశం ఏటా దాదాపు 800 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని చంద్రబాబు అన్నారు. క్రూడాయిల్ తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద దిగుమతి అని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే బంగారం ఉత్పత్తి వల్ల దేశ విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయన్నారు.
{{/usCountry}}'రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన చరిత్ర మనది. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని అందించింది కూడా మన సీమ గడ్డే. కాలక్రమేణా కరవుతో ఎడారిగా మారుతున్న తరుణంలో.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమకు జీవం పోశాం. ఇప్పుడు ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ పురోభివృద్ధికి సరికొత్త గ్రోత్ ఇంజిన్ కాబోతోంది.' అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి భారతదేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా.. ఆంధ్రప్రదేశ్‌ను 'స్వర్ణాంధ్ర'గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, దానికి స్వర్ణగిరి నుంచే పునాది పడిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.