Rashmika Vijay: రాయలసీమ మై లవ్.. మా సీమ రాయలసీమ అంటూ విజయ్, రష్మిక ఎమోషనల్ పోస్ట్.. రణబాలి షూటింగ్ గ్లింప్స్
Rashmika Vijay: రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఒకేసారి రాయలసీమకు, అక్కడి అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణబాలి షూటింగ్ కు సంబంధించిన ఓ బిహైంద్ సీన్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
Rashmika Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి మూవీ రణబాలి (Ranabaali). ఈ సినిమా షూటింగ్ రాయలసీమలోనే చాలా వరకు జరిగింది. దీంతో అక్కడి అభిమానులు, ఆ ప్రాంతంతో తమకు ఏర్పడిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్, రష్మిక ఒకేసారి ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

మా సీమ రాయలసీమ అంటూ..
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ శుక్రవారం (ఏప్రిల్ 3) ఓ చిన్న వీడియోను తమ ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఇద్దరూ రాయలసీమ మై లవ్.. థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సీమ.. మా సీమ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.
ఆ తర్వాత రణబాలి షూటింగ్ కోసం విజయ్, రష్మిక రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు లభించిన ఘన స్వాగతం, భారీ పూలమాలలు, ర్యాలీలు, దైవ దర్శనాలను ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు రణబాలి షూటింగ్ బిహైండ్ ద సీన్స్ విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మళ్లీ ఊరికి వచ్చినట్లుంది అంటూ అక్కడి అభిమానులు ఉద్దేశించి విజయ్ మాట్లాడిన మాటలను కూడా ఈ వీడియోలో చేర్చారు.
రణబాలి మూవీ విశేషాలు
విజయ్, రష్మిక గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఇప్పుడు రణబాలి మూవీలో కలిసి నటిస్తున్నారు. అందులోనూ పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్యామ్ సింఘరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 1850 నుంచి 70ల మధ్య జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో రణబాలిగా విజయ్, అతని భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్, ఏందయ్య సామి అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రష్మిక పోస్టుకు అర్థమేంటి?
ఇక అంతకుముందు రష్మిక మందన్న మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. రష్మిక, విజయ్‌ల యానిమేటెడ్ కార్టూన్లతో కూడిన ఆ వీడియోకు "Now it’s us three" అనే క్యాప్షన్ ఉండటంతో.. రష్మిక గర్భవతి ఏమో అని అందరూ భావించారు.
రష్మిక పోస్ట్ చేసిన ఆ వీడియో వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రెగ్నెన్సీ కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఇది 'టెర్రిబ్లీ టైని టేల్స్' (Terribly Tiny Tales) సంస్థతో కలిసి వారు చేస్తున్న ఒక కొత్త డిజిటల్ ప్రాజెక్ట్ కావడం విశేషం. రష్మిక క్యారెక్టర్ ఆధారంగా సృష్టించిన 'Ru' (రూ) అనే యానిమేటెడ్ క్యారెక్టర్‌ను విజయ్ దేవరకొండతో కలిపి 'Rashmika & Ru' అనే ఆనిమేటెడ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సిరీస్‌లో రష్మిక, విజయ్‌లతో పాటు 'రూ' అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది కాబట్టే ఆమె "Us Three" (మేము ముగ్గురం) అని పేర్కొంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


