దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ కాలంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు పాత విధానాలు, అనవసర నిబంధనలను సరళీకరించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం ఉద్యోగులకు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదని సీఎం అన్నారు.
సవాళ్లను పరిష్కరించడంలో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే సంస్థలుగా అవి మారాలని చంద్రబాబు సూచించారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా.. ఆ శిక్షణ వల్ల పాలనలో ఎలాంటి మార్పు వచ్చిందో, ప్రజలకు అందే సేవల్లో ఎలాంటి మెరుగుదల కనిపించిందో కూడా కొలవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందడం మాత్రమే కెపాసిటీ బిల్డింగ్ కాదని.. నేర్చుకున్న అంశాలను ఉద్యోగులు తమ విధుల్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు. ప్రజలకు అందే సేవల నాణ్యత ఎంత మెరుగుపడుతోందన్న అంశమే ప్రామాణికత అని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. మిషన్ కర్మయోగి కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్లో నమోదు అయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
{{/usCountry}}ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. మిషన్ కర్మయోగి కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్లో నమోదు అయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
{{/usCountry}}రెండు కోట్ల సర్టిఫికెట్ల కంటే నేర్చుకున్న అంశాలే కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందే సేవల్లో మార్పుగా ఈ అంశాలు కనిపించాలని అని సీఎం అన్నారు. శిక్షణతో ఓ రెవెన్యూ అధికారి పౌరుడి సమస్యను వేగంగా పరిష్కరించటం, ఉపాధ్యాయుడు తరగతి గదిలో మెరుగైన బోధన అందించటం.. పోలీసు అధికారి మరింత మానవీయంగా స్పందించటం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. పూర్తి చేసుకున్న శిక్షణతో పౌరులకు నాణ్యమైన సేవలు అందుతున్న తీరుకు కొలమానంగా ఉండాలని సూచించారు.
భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్నా, కొన్ని చోట్ల పాత నిబంధనలు, విధానాలు కొనసాగుతున్నాయని సీఎం అన్నారు. కంప్యూటర్లు వచ్చినా అనవసరమైన పేపర్‌వర్క్ కొనసాగడం, దరఖాస్తులను డిజిటల్ చేసినా అనేక అనుమతులు అవసరం కావడం, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా పౌరులను కార్యాలయాలకు రప్పించడం వంటి విధానాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
పాత విధానాన్ని డిజిటలైజ్ చేయడం మాత్రమే ఆధునిక పాలన కాదని... మొత్తం ప్రక్రియను మార్పు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు. జన్ విశ్వాస్ వంటి సంస్కరణలు ఈ దిశలో కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఐటీ విప్లవం తర్వాత ఏఐ కాలం ప్రారంభమైందని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారాల్సిందేనని సీఎం అన్నారు. ఏఐను కేవలం సాంకేతిక సాధనంగా కాకుండా పాలనలో నిర్ణయాలు, సమస్యల గుర్తింపు, ఉద్యోగుల నైపుణ్యాల అంచనా, శిక్షణ అవసరాల గుర్తింపులో వినియోగించుకోవాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనా వ్యవహారాలను గణనీయంగా మార్చగలదని సీఎం అన్నారు. ఉద్యోగుల సామర్థ్య లోపాలను గుర్తించడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణా కోర్సులను సూచించడం, పరిపాలనా నిర్ణయాలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాంగం ప్రభుత్వ పాలనలో కీలకమని సీఎం అన్నారు. వరదలు, తుపాన్ల లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఉద్యోగులే ముందు ఉంటారని గుర్తుచేశారు.