ఆంధ్రాలో సంక్రాంతి పండుగ జరుపుకోని ఊరు.. స్నానాలు చేయరు, సంబరాలకు దూరం!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా నిర్వహించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆంధ్రాలో ఓ గ్రామం సంక్రాంతి పండుగను జరుపుకోదు. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ కోసం ప్రజలు సంవత్సరం అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పండుగను రాష్ట్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీలో సంక్రాంతి పండుగ చూసేందుకు జనాలు వస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన ఏపీ వాసులు కూడా కచ్చితంగా సంక్రాంతి పండుగకు హాజరుకావాల్సిందే. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందేలు, హరిదాసు కీర్తనలు.. ఇలా పల్లె అందాలను చూస్తే సంక్రాంతికి ముచ్చటేస్తుంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండగ చేసుకోరు. దీనికి వెనక ఓ పెద్ద కారణం ఉంది. కనీసం సంక్రాంతి పండుగ రోజున స్నానాలు చేయరు, ఇంటిని ఊడవరు. సాధారణంగా ఎలా ఉంటారో అలానే భావిస్తారు. ఈ పద్ధతి నిన్నా.. మెున్నటి నుంచి మెుదలైంది కాదు. చాలా ఏళ్ల నుంచి పాటిస్తున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం పి.కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొనేవారు. పండుగ అనగానే సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకురావడం చేస్తుంటాం. అలానే పి.కొత్తపల్లిలోని ఒక వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లాడు. అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఏదో అయి ఉంటుందిలే అని అందరూ సాధారణంగానే భావించారు.
ఆ తర్వాత రోజున ఆత్మకూరు సంతకు వెళ్లిన మరో ముగ్గురు కూడా అలాగే చనిపోయారు. ఈ ఆకస్మిక మరణాలతో పి.కొత్తపల్లి గ్రామస్థుల్లో భయం మెుదలైంది. వరుసగా పండుగ సందర్భంగా సంతకు వెళ్లినవాళ్లు.. వెళ్లినట్టే చనిపోయారు. దీంతో సంక్రాంతి అంటే మరింత భయం మెుదలైంది గ్రామస్థుల్లో. ఇక తర్వాత ఊర్లో సంక్రాంతి నిర్వహించకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారు.
పండుగ నిర్వహిస్తే అనర్థం జరుగుతుందని భయంతో ఉండేవారు. అది కాస్త అలాగే కంటిన్యూ అయింది. ఊళ్లో సంక్రాంతి పండుగ జరుపుకోవడం మానేశారు. చాలా తరాలు మారినా.. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పి.కొత్తపల్లి గ్రామస్థులు పాటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సంక్రాంతి జరుపుకోకుండా పండుగ జరిగే మూడు రోజులు ఇల్లు, వాకిలిని శుభ్రం చేయరు. ముగ్గులు వేయరు, పిండి వంటలు చేయరు, స్నానాలు కూడా చేయరు.. అలా సంక్రాంతి పండుగకు దూరంగా పి.కొత్తపల్లి గ్రామం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


