చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్-వరుసగా మూడేళ్లు బాక్సాఫీస్ కింగ్-పండగకు రిలీజైన మెగాస్టార్ సినిమాలు ఏవో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి పండగకు మంచి కనెక్షన్ ఉంది. చిరుకు సంక్రాంతి పండగ సెంటిమెంట్ గా వస్తోంది. ఒకప్పుడు వరుసగా మూడేళ్లు సంక్రాంతికి బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు మెగాస్టార్. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు అంటూ వస్తున్న చిరు కెరీర్ లో సంక్రాంతి సినిమాలు ఎన్ని ఉన్నాయో చూసేయండి. 

Published on: Jan 11, 2026, 15:33:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ కింగ్ గా, మెగాస్టార్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నారు. చిరుకు సంక్రాంతి అంటే సెంటిమెంట్. మరి ఆయన కెరీర్ ఏ సినిమాలు సంక్రాంతికి వచ్చాయో, వాటి రిజల్ట్ ఏంటో ఇక్కడ చూసేద్దాం.

చిరంజీవి సంక్రాంతి సినిమాలు (x/KChiruTweets)
చిరంజీవి సంక్రాంతి సినిమాలు (x/KChiruTweets)

మన శంకర వరప్రసాద్ గారు

సంక్రాంతి 2026కు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు చిరంజీవి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ట్రైలర్ చూస్తే సంక్రాంతికి చిరు ఖాతాలో మరో హిట్ పడటం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రీ ఎంట్రీ సంక్రాంతికే

మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినీ కెరీర్ కు గ్యాప్ ఇచ్చారు. కొంత కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ రీ ఎంట్రీ మూవీ కూడా సంక్రాంతికే రిలీజైంది. ఖైదీ నంబర్ 150 సినిమాతో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాస్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. 2023 సంక్రాంతికి కూడా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నారు చిరు.

సంక్రాంతికి వరుసగా మూడేళ్లు

ఒక్క సంక్రాంతికి కాదు వరుసగా మూడేళ్ల పాటు సంక్రాంతికి బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు చిరంజీవి. 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో సంచలనం క్రియేట్ చేశారు చిరు. ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అంతకుముందు 1985లో వచ్చిన చట్టంతో పోరాటం మూవీ చిరుకు తొలి సంక్రాంతి సినిమా.

ఈ హిట్లు కూడా

1993లో ముఠా మేస్త్రి, 1997లో హిట్లర్, 1999లో స్నేహం కోసం, 2000లో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో అంజి సినిమాలను సంక్రాంతికే రిలీజ్ చేశారు మెగాస్టార్. ఇందులో మృగరాజు ఒక్కటే ఫ్లాప్. ఇక అంజి ఏమో యావరేజ్ గా నడిచింది కానీ గ్రాఫిక్స్ కు ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. చిరు కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మృగరాజు, అంజి మినహా అన్ని చిత్రాలు అదరగొట్టాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారుతో మరోసారి పండగకు మ్యాజిక్ చేయనున్నారు చిరు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More