...
...
Next Story

తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ.. రాత్రిపూట భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు!

తిరుమలలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడసేవ జరగనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనుంది.

Published on: Nov 4, 2025, 17:03:52 IST
Advertisement

తిరుమలలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడుసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

అన్నాభిషేకం

కార్తీక పౌర్ణమి గరుడ వాహన సేవ
కార్తీక పౌర్ణమి గరుడ వాహన సేవ

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్రభాతంతో మేల్కొలిపి 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్తన నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.

వేడి నీటి కోసం సోలార్ ప్యానెల్

తిరుమలలోని వెంకటాద్రి నిలయం (PAC-5)లో యాత్రికులకు వేడి నీటి సరఫరా కోసం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తూ అవసరమైన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు. ప్రవేశ ద్వారం వద్ద యాత్రికులు పాద రక్షలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారని, ప్రవేశానికి ముందు వెళ్లే మార్గంలోనే స్టెయిన్‌లెస్ స్టీల్ పాద రక్షల ర్యాక్‌లు ఏర్పాటు చేసి, ప్రతి యాత్రికుడు ఆ మార్గం గుండా వెళ్లేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

యాత్రికుల భద్రత కోసం విజిలెన్స్ విభాగం తగిన సిబ్బందిని నియమించి, సీసీ కెమెరాలను అన్ని కీలక పాయింట్లలో అమర్చాలని వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు పై తాజాగా వేసిన బీటీ కోటింగ్ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సైన్ బోర్డులు, రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మల తొలగింపు, అక్కగార్ల గుడి సమీపంలోని కొండల పైనుండి వర్షపు నీటి మళ్లింపుపై చర్చించారు. ఘాట్ రోడ్లలో ముఖ్యమైన ప్రదేశాల్లో రోడ్డు భద్రతా నిబంధనలు, NHAI ప్రమాణాలకు అనుగుణంగా ఏకరీతిలో, అందంగా కనిపించేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks