నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేది ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Published on: Oct 7, 2026, 07:48:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పెరటాసి మాసం చివరి వారం కూడా కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశముంది. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు
నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

ప్రత్యేక, వీఐపీ దర్శనాలు రద్దు

బ్రహ్మోత్సవాలు జరిగే ఈ పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ (NRI), డిఫెన్స్ కేటగిరీలకు ఇచ్చే ప్రత్యేక ప్రాధాన్య దర్శనాలను కూడా పూర్తిగా నిలిపివేసింది.

అంతేకాకుండా, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను అక్టోబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా, సులభంగా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కాలంలో అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More