TTD Godavari Harati : నవంబర్ 16న గోదావరి నదీ తీరంలో టీటీడీ భారీ కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నవంబర్ 16న TTD ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవమూర్తులతో గోదావరి హారతి నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

Published on: Oct 4, 2026, 12:30:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా సకల జీవరాశులకు ప్రాణదాతలుగా, పవిత్ర దైవస్వరూపాలుగా ఆరాధించే అత్యున్నత సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఈ పవిత్ర నదీ ఆరాధన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ…. గోదావరి నదికి ఆధ్యాత్మిక, సంప్రదాయబద్ధంగా మహా హారతి సమర్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది.

గోదావరి నది
గోదావరి నది

తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని అత్యంత భారీ వేడుకగా నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఉత్సవమూర్తుల సమక్షంలో ఈ గోదావరి హారతి కార్యక్రమం జరగడం విశేషం.

ఈ కార్యక్రమ ఏర్పాట్లపై టీటీడీ జేఈవో ప్రభల గోపినాథ్ మాట్లాడుతూ…. "భారతీయ ధర్మంలో నదీ దేవతలకు దీపారాధన, హారతులు సమర్పించడం అనేది మన పూర్వీకులు అందించిన పవిత్ర సంస్కృతి. పుణ్యనదులు నిరంతరం పుష్కలంగా ప్రవహించి సమస్త ప్రాణకోటికి జీవనాధారంగా, సస్యశ్యామలంగా నిలవాలని భగవంతుడిని ప్రార్థించడమే ఈ గోదావరి హారతి ప్రధాన ఉద్దేశం" అని స్పష్టం చేశారు.

కార్యక్రమ వేదిక - వేళలు:

రాబోయే నవంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ, వేదమంత్రోచ్ఛారణల మధ్య గోదావరి మాతకు మహోన్నత రీతిలో హారతులు సమర్పిస్తారు.

ఈ పవిత్రమైన పుణ్యకార్యంలో భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందాలని టీటీడీ పిలుపునిచ్చింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More