Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - అక్టోబర్ లో జరిగే విశేష పర్వదినాలివే
అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు పలు విశేష పర్వదినాలున్నాయి. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబర్ నెలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పర్వదినాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

అక్టోబర్ నెలలో జరిగే ప్రధాన ఉత్సవాలు, వాటి తేదీల వివరాలను టీటీడీ వెల్లడించింది. భక్తుల సౌకర్యార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రణాళికను సిద్ధం చేశారు.
అక్టోబర్ నెలలో జరిగే పర్వదినాలు - లిస్ట్
• అక్టోబర్ 11 (శనివారం): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరుగుతుంది.
• అక్టోబర్ 12 (ఆదివారం): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అధికారికంగా ప్రారంభమవుతాయి.
• అక్టోబర్ 16 (గురువారం): బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైన, భక్తులు ఎంతోగానో ఎదురుచూసే శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 20 (మంగళవారం): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం (చక్రస్నానం) కార్యక్రమం జరుగుతుంది. ఇదే రోజున శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర వేడుకను కూడా నిర్వహిస్తారు.
• అక్టోబర్ 21 (బుధవారం): శ్రీ బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్ర మహోత్సవం జరుగుతుంది.
• అక్టోబర్ 26 (సోమవారం): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారికి పౌర్ణమి గరుడసేవను ఘనంగా నిర్వహిస్తారు.
ఈ విశేష రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, వసతి, ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

