Tirumala : సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు జరిగే రోజులు
Tirumala : సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాల లిస్టును టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ నెలలోనే జరుగుతాయి. ఆ వివరాలను చూడండి

సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.
సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.
సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.
సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.
సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.
సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.
సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.
సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.
సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం.
గోకులాష్టమి వేడుకలు
తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా నిలవనుంది. భక్తిభావాన్ని పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.
గోవులను ప్రేమించిన గోపాలకృష్ణుని జన్మదినమైన గోకులాష్టమికి గోసంరక్షణశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తూ గోసేవ, గోపూజలకు విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తోంది.
గోకులాష్టమి సందర్భంగా గోసంరక్షణశాలను మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. గోవులను అందంగా అలంకరించి భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు కావచ్చు. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భజనలు, కోలాటాలు, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారు.
ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ నిర్వహించనున్నారు.
శ్రీకృష్ణ నామస్మరణతో.. గోమాత సేవతో.. భక్తి పారవశ్యంతో సాగనున్న గోకులాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపూజ, గోసేవలో భాగస్వాములు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


