కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం - టీటీడీలో తొలి అరెస్ట్…!

తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ ఇంజనీరింగ్ శాఖ సీనియర్ అధికారి సుబ్రహ్మణ్యంను సీబీఐ పర్యవేక్షణలోని సిట్ అరెస్ట్ చేసింది. 

Published on: Nov 28, 2025, 10:30:15 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేయగా… తాజాగా టీటీడీలో కూడా తొలి అరెస్ట్ నమోదైంది. అప్పట్లో కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యాన్ని సిట్‌ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

కల్తీ కేసు కేసులో కీలక పరిణామం
కల్తీ కేసు కేసులో కీలక పరిణామం

రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు… డిసెంబరు 10 వరకు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో సుబ్రహ్మణ్యం 29వ నిందితుడిగా ఉన్నాడు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న (ఏ24)కు సుబ్రహ్మణ్యం సహకరించారని సిట్‌ ఇప్పటికే గుర్తించింది.

తాజాగా అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం గతంలో టీటీడీలో జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) గా పనిచేశారు.లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యితో సహా కీలక సామగ్రిని సేకరించే విధుల్లో కీలకంగా ఉన్నారని గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి తెలిపారు.

ప్రస్తుతం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం టీటీడీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. తిరుపతి ఎన్‌జీవో కాలనీలోని ఆయన నివాసం నుంచి గురువారం మధ్యాహ్నం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు సిట్‌గా ఏర్పడి సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే.

ఈ కేసులో రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు ఇతర వ్యక్తులు అరెస్ట్ అయినప్పటికీ… టీటీడీలో కీలకంగా ఉన్న అధికారిలెవరూ అరెస్ట్ కాలేదు. అంతేకాకుండా కేసులో ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నప్పటికీ ఇంతవరకూ అరెస్టు కాలేదు. అనూహ్యంగా సీనియర్ అధికారి అయిన సుబ్రహ్మణ్యాన్ని సిట్ అరెస్ట్ చేయటం సంచలన పరిణామంగా మారింది.

టీటీడీ పరిధిలో అరెస్టులు సుబ్రమణ్యం ఒక్కరితోనే ఆగుతాయా లేక మరికొందరు కూడా ఈ లిస్టులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More