...
...
Next Story

శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త - నేటి నుంచి టోల్‌ ఫ్రీ జర్నీ..! ఇవిగో వివరాలు

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వాహనాలకు టోల్ ఫ్రీ ఉండనుంది.ఫిబ్రవరి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయిస్తారు.

Published on: Feb 13, 2026, 09:27:09 IST
Advertisement

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి దగ్గరపడిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇవ్వనుంది.

టోల్ మినహాయింపు…

శ్రీశైలం
శ్రీశైలం

శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రభుత్వం సూచిన చోట్ల ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆలయం, అటవీశాఖ టోల్‌గేట్ల దగ్గర టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటన విడుదల చేశారు.

ఉచితంగా లడ్డూలు…

గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాల్గో రోజులపాటు ఈ అవకాశం ఉంటుంది. ఇక సాధారణ సమయాల్లో రాత్రి సమయంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించరు. బ్రహ్మోత్సవాల రద్దీ వేళ రాత్రివేళల్లో కూడా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ప్రకటించారు.

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి గురువారం వరకు 2,59,050 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. మహాశివరాత్రి రోజు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఆ రోజు దాదాపు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు…. భక్తుల రద్దీ దృష్ట్యా వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks